Shreyas iyer test debut for india: మైదానంలో ఆడేటప్పుడు గాయపడి ఆటకు దూరమవ్వడం క్రికెటర్లకు సర్వసాధారణం. కానీ కోలుకున్న తర్వాత అవకాశాల్ని దక్కించుకొని, ఫామ్‌ను ప్రదర్శించి తామెంటో నిరూపించుకోవడమంటే గొప్ప విషయమనే చెప్పాలి. ఇప్పుడా ఘనతనే అందుకున్నాడు శ్రేయస్ అయ్యర్.
ఈ ఏడాది మార్చి 23న పుణె వేదికగా ఇంగ్లాండ్‌తో వన్డేలో గాయపడి చాలాకాలం పాటు ఆటకు దూరమయ్యాడు శ్రేయస్(shreyas iyer injury). యూకే వెళ్లి సర్జరీ చేయించుకున్నాడు. ఈ గాయం వల్ల అతడు రాయల్ లండన్ కప్, ఈ సీజన్ ఐపీఎల్ తొలి దశకు పూర్తిగా దూరమయ్యాడు. అనంతరం కోలుకున్న అయ్యర్.. మెగాలీగ్ రెండో దశకు అందుబాటులోకి వచ్చి 175 పరుగులు చేశాడు. కానీ అతడికి ఇటీవల జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో చోటు దక్కలేదు(shreyas iyer t20 world cup). కానీ న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఈ క్రమంలోనే టెస్టుల్లో అరంగేట్రం చేయాలన్న అతడి కల ఎట్టకేలకు నెరవేరింది. కాన్పూర్ వేదికగా గురువారం(నవంబరు 25) ప్రారంభమైన తొలి టెస్టులో దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ చేతుల మీదగా టీమ్ఇండియా క్యాప్(303) అందుకున్నాడు. తనకు వచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదో స్థానంలో వచ్చిన అయ్యర్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి ఆకట్టుకున్నాడు(shreyas iyer vs new zealand). 136 బంతుల్లో 75 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అందులో ఏడు ఫోర్లు, రెండు సిక్స్‌లు ఉన్నాయి. మొత్తంగా తొలి రోజు ఆటముగిసేసరికి టీమ్ఇండియా 258/4 స్కోరు చేయగా.. అతడు ఇంకా క్రీజులోనే ఉన్నాడు. దీంతో సోషల్‌మీడియా వేదికగా అభిమానులు అతడిపై ప్రశంసిస్తున్నారు. సెంచరీ చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదే కనుక జరిగితే అయ్యర్ జీవితంలో ఇదో మధుర జ్ఞాపకంలా మిగిలిపోతుంది.
అయ్యర్ కూడా టెస్టు అరంగేట్రం చేయడంపై ఇన్‌స్టాలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. అందులో తాను గాయపడినప్పుడు చికిత్స తీసుకుంటున్న ఫొటోలు, తాజాగా టెస్ట్ జెర్సీ ధరించిన ఉన్న ఫొటోలను కలిపి పెట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
శ్రేయస్(shreyas iyer stats).. కెరీర్లో ఇప్పటివరకు 31 టీ20(580 పరుగులు), 22వన్డేలు(813) ఆడాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 54 మ్యాచ్‌లు(4592 పరుగులు) చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 23 అర్ధ శతకాలు ఉన్నాయి. ఐపీఎల్‌లోనూ 87 మ్యాచులు(2375) ఆడాడు. ఈ మెగాలీగ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన అతడు గాయం కారణం ఈ సీజన్ ఐపీఎల్ తొలి దశకు దూరమయ్యాడు. దీంతో కెప్టెన్సీ బాధ్యతలను పంత్‌కు అప్పగించారు.
ఇదీ చూడండి: IND Vs NZ: శ్రేయస్ ధనాధన్ ఇన్నింగ్స్.. టీమ్ఇండియా 258/4