ETV Bharat / sports

'రవిశాస్త్రి వ్యాఖ్యల్ని అశ్విన్ తప్పుగా అర్థం చేసుకున్నాడు'

author img

By

Published : Dec 26, 2021, 12:15 PM IST

Sarandeep Singh on Ashwin: 2018-19 ఆస్ట్రేలియా పర్యటనలో రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యల్ని స్పిన్నర్ అశ్విన్ తప్పుగా అర్థం చేసుకున్నాడని తెలిపాడు మాజీ సెలెక్టర్ శరణ్​దీప్ సింగ్. కుల్​దీప్​ను శాస్త్రి పొగడటంలో తప్పులేదని వెల్లడించాడు.

Sarandeep Singh on Ashwin, Sarandeep Singh Ravishastri, రవిశాస్త్రి రవి అశ్విన్, శరణ్​దీప్ సింగ్ అశ్విన్ో
Ravi Ashwin

Sarandeep Singh on Ashwin: టీమ్‌ఇండియా ఆఫ్‌ స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్, మాజీ కోచ్‌ రవిశాస్త్రిని తప్పుగా అర్థం చేసుకున్నాడని మాజీ సెలెక్టర్‌ శరణ్‌దీప్‌ సింగ్‌ అన్నాడు. 2018-19 ఆస్ట్రేలియా పర్యటనలో శాస్త్రి చేసిన వ్యాఖ్యలతో తాను బాధపడిటన్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు అశ్విన్. ఇదే అంశంపై శరణ్​దీప్ స్పందిస్తూ.. శాస్త్రి ఉద్దేశాన్ని అశ్విన్ తప్పుగా అర్థం చేసుకున్నాడని తెలిపాడు.

"శాస్త్రి వ్యాఖ్యలను అశ్విన్ తప్పుగా అర్థం చేసుకున్నాడు. నాటి పర్యటనలో నేనూ జట్టుతోనే ఉన్నాను. విదేశాల్లో కుల్‌దీప్‌ అత్యుత్తమ బౌలర్‌ అని మాత్రమే శాస్త్రి ఉద్దేశం. ఎందుకంటే అక్కడి భిన్న పరిస్థితుల్లో తన బౌలింగ్‌ స్టైల్‌ వైవిధ్యంగా ఉంటుంది. దీన్ని అశ్విన్‌ మరోలా అర్థం చేసుకున్నాడు. ఇందులో శాస్త్రి చెప్పింది నిజమే. అశ్విన్‌ గొప్ప బౌలర్‌. ఇదివరకు ఆఫ్రికన్‌ పిచ్‌లపైనా బాగా రాణించాడు. అతడు గేమ్‌ ఛేంజర్‌ కూడా. అయితే, ఇది అతడికి చివరి పర్యటన కాదు. అతడు ఆడాల్సింది ఇంకా చాలా ఉంది. ఇక ఈ సిరీస్‌లో కోహ్లీ గురించి మాట్లాడాల్సి వస్తే.. చాలా మానసిక ప్రశాంతతతో ఆడతాడు. వన్డే కెప్టెన్సీ వివాదం అతడి ఆటపై ప్రభావం చూపదనుకుంటా. ఇంతకుముందు ఎలా ఆడాడో ఇకపై అలాగే రెచ్చిపోతాడు. ఇప్పుడిక అతడి నుంచి శతకం ఆశించొచ్చు. తనకిప్పుడు సరైన నాణ్యమైన జట్టు ఉంది" అని శరణ్‌దీప్‌ అభిప్రాయపడ్డాడు.

Ashwin Ravishastri controversy: ఇటీవల అశ్విన్‌ ఓ క్రీడాఛానల్‌తో మాట్లాడుతూ 2018-19 ఆస్ట్రేలియా పర్యటనలో తనకు ఎదురైన అనుభవాల గురించి వివరించాడు. ఈ సందర్భంగా నాటి సిడ్నీ టెస్టులో ఐదు వికెట్లు తీసిన కుల్‌దీప్‌ను శాస్త్రి ఆరోజు మెచ్చుకుంటూ.. విదేశాల్లో అతడే తమ తొలి ప్రాధాన్య స్పిన్నర్‌ అని వ్యాఖ్యానించాడు. ఈ మాటలతో తాను చాలా బాధపడ్డానని, అప్పుడు తనను బస్సు కింద పడేసినట్లు అనిపించిందని అశ్విన్‌ వాపోయాడు. అనంతరం అశ్విన్‌ వ్యాఖ్యలపై స్పందించిన శాస్త్రి.. జట్టుకు ఏది అవసరమో అదే చేస్తానని, అందరికీ నచ్చినట్టు వ్యవహరించనని తెలిపాడు. తాను ఎవరికీ వెన్న పూయనని చెప్పాడు.

ఇవీ చూడండి:

ఈ ఏడాది టెస్టుల్లో 'సూపర్ స్టార్స్' వీరే!

'బాక్సింగ్ డే టెస్టు'.. ఈ పేరెలా వచ్చిందో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.