ఐపీఎల్లో(IPL) ఆయా ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడూ పంచుకుంటూ అభిమానుల్లో జోష్‌ను నింపుతుంటాయి. త్వరలోనే ఈ మెగాలీగ్ రెండో దశ ప్రారంభమవుతున్న నేపథ్యంలో చెన్నైసూపర్‌కింగ్స్ ఫ్రాంచైజీ(Chennai Super Kings).. అభిమానులతో ధోనీ(Dhoni) టీనేజ్ ఫొటోను పంచుకుంది. 'యూత్ ఫ్యాషన్ ఐకాన్ గురించి మీరు విన్నారా' అంటూ వ్యాఖ్య రాసుకొచ్చింది. దీంతోపాటు సామ్‌కరన్ చిన్ననాటి ఫొటోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇవి రెండు వైరల్‌గా మారాయి. వీటికి విపరీతంగా లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఐపీఎల్లో విజయవంతమైన కెప్టెన్‌గా ధోనీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒక్క సీజన్ మినహా టోర్నీలో ఆడిన ఆన్ని సీజన్లలో చెన్నైసూపర్కింగ్స్ను ప్లేఆఫ్స్‌కు చేర్చాడు. మూడు సార్లు జట్టుకు ట్రోఫీని అందించాడు.
ఇదీ చూడండి చెన్నై సారథి ధోనీ ఖాతాలో మరో రికార్డు