ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (World Test Championship)కు ముందు ఆసక్తికర చర్చకు తెరలేపింది అంతర్జాతీయ క్రికెట్ మండలి(Icc). 'అల్టిమేట్ టెస్ట్ సిరీస్'(Ultimate Test Series) ఏదనే దాని గురించి ఓటింగ్ నిర్వహించింది. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన 2020-21 బోర్డర్-గావస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy)ని విజేతగా నిర్ణయించారు అభిమానులు.
"డబ్ల్యూటీసీ ఫైనల్స్ 2021కి ముందు మేము అల్టిమేట్ టెస్ట్ సిరీస్ ఏంటిదనే నిర్ణయించాలనుకున్నాం. అందుకోసం 15 టెస్ట్ సిరీస్ల మధ్య పోటీ నెలకొంది. ఇందులో 70 లక్షల మంది అభిమానులు తమ నిర్ణయాన్ని ఓటింగ్ రూపంలో చెప్పారు. చివరికి 2020-21లో జరిగిన బోర్డర్-గావస్కర్ ట్రోఫీని విజేతగా నిర్ణయించారు" అని ఐసీసీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది.
-
36 all-out. Ajinkya Rahane’s MCG ton. Steve Smith’s SCG masterclass and India’s stubborn resistance. The storming of the Gabba.
— ICC (@ICC) June 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
A comprehensive look back on the 2020/21 Border-Gavaskar Trophy which has been crowned #TheUltimateTestSeries 👑
">36 all-out. Ajinkya Rahane’s MCG ton. Steve Smith’s SCG masterclass and India’s stubborn resistance. The storming of the Gabba.
— ICC (@ICC) June 8, 2021
A comprehensive look back on the 2020/21 Border-Gavaskar Trophy which has been crowned #TheUltimateTestSeries 👑36 all-out. Ajinkya Rahane’s MCG ton. Steve Smith’s SCG masterclass and India’s stubborn resistance. The storming of the Gabba.
— ICC (@ICC) June 8, 2021
A comprehensive look back on the 2020/21 Border-Gavaskar Trophy which has been crowned #TheUltimateTestSeries 👑
ఇదీ చదవండి: WTC: 13ఏళ్ల కిందట సెమీస్లో.. ఇప్పుడు ఫైనల్లో..
ఓ వైపు ఇండియా-పాకిస్థాన్ మధ్య 2001లో జరిగిన సిరీస్, ఇండియా-ఆస్ట్రేలియా మధ్య 2020-21లో జరిగిన బోర్డర్-గావస్కర్ మధ్య సెమీస్లో పోటీ నెలకొంది. ఈ రెండింటిలో ఫైనల్కు బోర్డర్-గావస్కర్ ట్రోఫీని నామినేట్ చేశారు ఫ్యాన్స్. మరో సెమీస్లో ఇండియా-పాకిస్థాన్ మధ్య 1999లో జరిగిన సిరీస్కు, ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య 2005లో జరిగిన సిరీస్కు మధ్య పోటీ నెలకొనగా ఇండియా-పాకిస్థాన్ సిరీస్ను తుది పోరుకు పంపారు అభిమానులు.
-
How we got there #TheUltimateTestSeries pic.twitter.com/XGM4To5W86
— ICC (@ICC) June 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">How we got there #TheUltimateTestSeries pic.twitter.com/XGM4To5W86
— ICC (@ICC) June 8, 2021How we got there #TheUltimateTestSeries pic.twitter.com/XGM4To5W86
— ICC (@ICC) June 8, 2021
ఇక చివరగా బోర్డర్-గావస్కర్ ట్రోఫీ, ఇండియా-పాక్ సిరీస్ మధ్య 'అల్టిమేట్ టెస్ట్ సిరీస్' ఏదనే దానిపై ఓటింగ్ నిర్వహించింది ఐసీసీ. ఇందులో బోర్డర్-గావస్కర్ టెస్ట్ సిరీస్యే అత్యుత్తమైనదిగా అభిమానుల ఆదరణ పొందింది.
అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 36 పరుగులకే చాప చుట్టేసింది. ఓ వైపు గాయాలు, కెప్టెన్ కోహ్లీ పితృత్వపు సెలవులపై స్వదేశానికి వచ్చాడు. వీటన్నింటిని లెక్కచేయకుండా తాత్కాలిక సారథి రహానె సారథ్యంలో టీమ్ఇండియా అద్భుత సిరీస్ విజయాన్ని సాధించింది. 2-1తో ట్రోఫీని కైవసం చేసుకుంది యువ భారత్.
ఇదీ చదవండి: ICC: 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' రేసులో ఉన్నది వీరే..