IND VS ENG 3rd T20: ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు ఓడిపోయింది. 17 పరుగులు తేడాతో ప్రత్యర్థి జట్టు విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు మాత్రమే చేసింది. కానీ, మొదటి రెండు టీ20ల్లో విజయం సాధించడం వల్ల సిరీస్ టీమ్‌ఇండియా వశమైంది. ఈ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్.. టీ20ల్లో తొలి శతకం బాదాడు. ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఓటమితో రోహిత్ అరుదైన రికార్డ్‌కు బ్రేక్ పడింది. ఈ మ్యాచ్ గెలిచి ఉంటే.. టీ20, వన్డే, టెస్టులు కలిసి వరుసగా మొత్తం 20 మ్యాచులు గెలిచిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ రికార్డును రోహిత్ సమం చేసేవాడు.
216 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్‌ఇండియా బ్యాటర్లు తడబడ్డారు. సూర్యకుమార్ యాదవ్(117) తప్ప మిగతా బ్యాటర్లందరూ విఫలమయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో డేవిడ్ విల్లే, జోర్డన్ చెరో రెండు వికెట్లు తీయగా.. టోప్లే 3 తీశాడు. గ్లీసన్, అలీ తలో వికెట్ తీశారు.
ముందుగా, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ భారీ స్కోర్ సాధించింది. మలన్ (77), లివింగ్‌స్టోన్ (42 నాటౌట్) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. భారత బౌలర్లు ఇంగ్లాండ్ హిట్టర్ల ధాటికి తేలిపోయారు. హర్షల్ పటేల్ (2/35), బిష్ణోయ్ (2/30) కాస్త పర్వాలేదనిపించగా.. ఆవేశ్ ఖాన్ (1/43), ఉమ్రాన్ మాలిక్ (1/56), రవీంద్ర జడేజా (0/45) భారీగా పరుగులు సమర్పించుకున్నారు.
ఇదీ చదవండి: జకోవిచ్ ఖాతాలో మరో వింబుల్డన్.. 21వ గ్రాండ్‌స్లామ్ కైవసం