Eoin Morgan retirement: టీమ్ఇండియాతో వన్డే, టీ20 సిరీస్‌కు ముందు ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. గతకొద్ది కాలంగా పేలవ ప్రదర్శన కనబరుస్తున్న పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు తెలిసింది. మంగళవారం తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తాడట. అతడి స్థానంలో సారథిగా వికెట్‌కీపర్ జాస్ బట్లర్ బాధ్యతలు తీసుకుంటాడని క్రికెట్ వర్గాల సమాచారం. అతడు 2015 నుంచి ఇంగ్లాండ్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
మోర్గాన్ సారథ్యంలో 2019 వన్డే ప్రపంచకప్‌ను ఇంగ్లాండ్ కైవసం చేసుకుంది. అయితే గత కొంత కాలంగా అతడు రాణించలేకపోతున్నాడు. గాయాల బారిన కూడా పడుతున్నాడు. తాజాగా నెదర్లాండ్స్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఆడిన రెండు మ్యాచుల్లోనూ అతడు ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. డకౌట్‌గా వెనుదిరిగాడు. గాయం కారణంగా ఆఖరి వన్డేకు దూరమయ్యాడు. మొత్తంగా కెరీర్లో అతడు 16 టెస్టులు(700పరుగులు), 248 వన్డేలు(7701), 115టీ20లు(1405) ఆడాడు. కాగా, ఇంగ్లాండ్-టీమ్ఇండియా మధ్య పరిమిత ఓవర్ల సిరీస్ జులై 7న ప్రారంభం కానుంది.
ఇదీ చూడండి: IND VS ENG: రోహిత్ స్థానంలో ఆ ప్లేయర్‌కు చోటు