ETV Bharat / sports

రోహిత్, రాహుల్​ అర్ధసెంచరీలు- టీ సమయానికి భారత్​ 157/2 - virat kohli

ఇంగ్లాండ్​తో రెండో టెస్టులో.. టీ సమయానికి భారత్​ 2 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. రోహిత్​ శర్మ 83 పరుగులు చేసి ఔటయ్యాడు. పుజారా మళ్లీ నిరాశపర్చాడు. ఇంగ్లాండ్​ బౌలర్​ అండర్సన్​ 2 వికెట్లు తీశాడు. ప్రస్తుతం రాహుల్​, కోహ్లీ క్రీజులో ఉన్నారు.

England vs India, 2nd Test t
ఇండియా- ఇంగ్లాండ్​ రెండో టెస్టు
author img

By

Published : Aug 12, 2021, 8:51 PM IST

లార్డ్స్​ వేదికగా ఇంగ్లాండ్​తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్​ మెరుగైన ప్రదర్శన చేస్తోంది. టీ సమయానికి 2 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. ఓపెనింగ్​ జోడీ రోహిత్​ శర్మ, కేఎల్​ రాహుల్​ శతక భాగస్వామ్యం నమోదు చేసింది. హాఫ్​సెంచరీలు చేసిన వీరిద్దరూ తొలి వికెట్​కు 126 పరుగులు జోడించారు.

England vs India, 2nd Test
రోహిత్​-రాహుల్​ శతక భాగస్వామ్యం

హిట్​మ్యాన్​​ 83 పరుగులు చేసి వెనుదిరిగాడు. అందులో 11 ఫోర్లు, ఓ సిక్స్​ ఉన్నాయి. మొదట ఆచితూచి ఆడిన రోహిత్​ శర్మ.. తర్వాత దూకుడు పెంచాడు. కచ్చితంగా సెంచరీ చేస్తాడన్నట్లే కనిపించినప్పటికీ.. అండర్సన్​ వేసిన చక్కటి ఇన్​స్వింగర్​కు బౌల్డయ్యాడు.

England vs India, 2nd Test
రోహిత్​ శర్మ
England vs India, 2nd Test
అర్ధసెంచరీ చేసిన సమయంలో.. బ్యాట్​ పైకెత్తుతూ..
England vs India, 2nd Test
అండర్సన్​ బౌలింగ్​లో రోహిత్​ క్లీన్​బౌల్డ్​

మరోవైపు.. రాహుల్​ ఇంగ్లాండ్​ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. 100 బంతుల వరకు ఒక్క బౌండరీ కొట్టకపోవడం గమనార్హం. తాను ఎదుర్కొన్న 108వ బంతిని స్టాండ్స్​లోకి తరలించి బౌండరీల ఖాతా తెరిచాడు. 137 బంతుల్లో అర్ధసెంచరీ మార్కును అందుకున్నాడు.

England vs India, 2nd Test
ముందుకొచ్చి సిక్సర్​ బాదిన రాహుల్​

పుజారా మరోసారి నిరాశపర్చాడు. 9 పరుగులు చేసి పెవిలియన్​ చేరాడు. ప్రస్తుతం రాహుల్(55), కెప్టెన్​ విరాట్​ కోహ్లీ(0) పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఇంగ్లాండ్​ బౌలర్లలో అండర్సన్​ మాత్రమే వికెట్​ తీశాడు.

ఇదీ చూడండి: 'అవును.. ప్రపంచ అత్యుత్తమ ఫీల్డర్లలో నేనూ ఒకడిని!'

ఓపెనర్లు రికార్డు..

లార్డ్స్​లో రోహిత్​-రాహుల్​దే అత్యుత్తమ ఓపెనింగ్​ భాగస్వామ్యం(126 పరుగులు).

2008లో దక్షిణాఫ్రికాపై ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ స్ట్రాస్‌, అలిస్టర్‌ కుక్ తొలి వికెట్‌కు జోడించిన 114 పరుగుల రికార్డును బ్రేక్​ చేశారు.

విదేశీ టీ20ల్లో..

ఇంగ్లాండ్​లో పర్యటించిన ఓ జట్టు.. మొదటి ఇన్నింగ్స్​ ఓపెనింగ్​ భాగస్వామ్యం రికార్డులో రోహిత్​-రాహుల్​ జోడీ రెండో స్థానంలో ఉంది.

1993లో ఆస్ట్రేలియాకు చెందిన ఓపెనింగ్​ జంట మైకేల్​ స్లేటర్​, మార్క్​ టేలర్​.. తొలి వికెట్​కు 128 పరుగులు చేశారు.

ఇదీ చూడండి: Shershaah Review: దేశభక్తి చిత్రం 'షేర్షా' ఎలా ఉందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.