Ashes 2023 : యాషెస్ తొలి టెస్టులో విజయం ఎవరిని వరిస్తుందో అన్న ఉత్కంఠ క్రికెట్ అభిమానులను కలవరపెడుతోంది. అంచనాలకు తగ్గట్లే నువ్వానేనా అన్నట్లు సాగుతున్న ఈ టోర్నీలో 281 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్ జట్టు.. సోమవారం జరిగిన ఆట చివరికి మూడు వికెట్లకు 107 రన్స్ స్కోర్ చ చేసింది. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో ఉస్మాన్ ఖవాజా మరోసారి పట్టుదలతో మైదానంలోకి దిగి చెలరేగిపోయాడు. అతడికి తోడుగా బోలాండ్ క్రీజులో ఉన్నాడు. అంతకుముందు జరిగిన రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ జట్టు.. 273 పరుగులకు ఆలౌటైంది. జో రూట్, హ్యారీ బ్రూక్ , స్టోక్స్ అత్యధిక పరుగులతో రాణించారు. ఇక ఆసిస్ జట్టుకు చెందిన కమిన్స్, లైయన్ ఇంగ్లాండ్ జట్టుకు ముచ్చెమటలు పట్టించారు.
Eng Vs Aus Ashes 2023 : ఆసీస్ జట్టు ఛేదనను ఆరంభించిన తీరు చూస్తే.. ఆ జట్టు సులువుగా లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించింది. ధాటిగా ఆడిన వార్నర్.. తన పార్ట్నర్ ఖవాజాతో కలిసి ఇన్నింగ్స్‌కు శుభారంభాన్నిచ్చాడు. ఈ క్రమంలో అతను ఇంగ్లాండ్ బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాడు. ఓపెనర్లు తొలి వికెట్‌కు 61 పరుగులు జోడించడం వల్ల నాలుగో రోజును ఆసీస్ గొప్పగా ముగించేలా కనిపించింది. కానీ వార్నర్‌ను ఔట్ చేసిన రాబిన్సన్‌కు ఇంగ్లాండ్‌ను పోటీలోకి తెచ్చాడు. ఆ తర్వాత లబుషేన్, స్మిత్‌లను అతి కొద్ది సమయంలోనే వరుసగా పెవిలియన్ చేర్చిన బ్రాడ్.. ఆసీస్‌ను ఆత్మరక్షణలోకి నెట్టాడు. మరో వికెట్ కోసం ఇంగ్లాండ్ గట్టిగానే ప్రయత్నించింది. కానీ నైట్‌వాచ్‌మన్ బోలాండ్‌తో కలిసి ఖవాజా పట్టుదల ప్రదర్శించిన తీరు ఆ ప్రయత్నాలను అడ్డుకున్నాడు.
England Vs Australia : మరోవైపు అంతకుముందు 28/2తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్ జట్టు.. ఇంకో 245 పరుగులు చేసిన ఆ తర్వాత.. మిగతా 8 వికెట్లు కోల్పోయింది. ఓవర్‌నైట్ బ్యాటర్ పోప్ మైదానంలో ఎక్కువసేపు నిలవకపోయినప్పటికీ.. మిగతా బ్యాటర్లు ధాటిగా ఆడి స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. రూట్, బ్రూక్, స్టోక్స్‌ల జోరు వల్ల ఇంగ్లాండ్ 196/5 స్కోర్ నమోదు చేసుకుని మెరుగైన స్థితిలోనే కనిపించింది. కానీ లైయన్, కమిన్స్ విజృంభించడం వల్ల ఆ జట్టు క్రమ క్రమంగా వికెట్లు కోల్పోయింది. ఆఖరిలో దిగిన రాబిన్సన్ పోరాడటం వల్ల ఓ మోస్తరు స్కోరుతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌ను ముగించింది.
-
And breathe... 😅
— England Cricket (@englandcricket) June 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
The Aussies end the day on 1️⃣0️⃣7️⃣/3️⃣ still needing 1️⃣7️⃣4️⃣.
Sum up that final hour 👇#EnglandCricket | #Ashes pic.twitter.com/2A4T9Dhgbi
">And breathe... 😅
— England Cricket (@englandcricket) June 19, 2023
The Aussies end the day on 1️⃣0️⃣7️⃣/3️⃣ still needing 1️⃣7️⃣4️⃣.
Sum up that final hour 👇#EnglandCricket | #Ashes pic.twitter.com/2A4T9DhgbiAnd breathe... 😅
— England Cricket (@englandcricket) June 19, 2023
The Aussies end the day on 1️⃣0️⃣7️⃣/3️⃣ still needing 1️⃣7️⃣4️⃣.
Sum up that final hour 👇#EnglandCricket | #Ashes pic.twitter.com/2A4T9Dhgbi
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 393/8 డిక్లేర్డ్; ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 386
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్: 273 (రూట్ 46, బ్రూక్ 46, స్టోక్స్ 43; కమిన్స్ 4/63, లైయన్ 4/80); ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 107/3 (ఖవాజా 34 బ్యాటింగ్, వార్నర్ 36; బ్రాడ్ 2/28)