టీమ్ఇండియా యువ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్.. గత రెండు నెలలుగా అద్భుతంగా రాణిస్తున్నాడని ఆ జట్టు ప్రధాన్కోచ్ రవిశాస్త్రి అన్నాడు. భారత జట్టుకు అతడు చేసిన సేవలను వేరొకరితో పోల్చలేనని తెలిపాడు. కీపింగ్‌లోనూ పంత్ మెరుగ్గా ఉన్నాడని వెల్లడించాడు.
"ఐపీఎల్ తర్వాత పంత్ సరైన నైపుణ్యంతో జట్టులోకి వచ్చాడు. అందరి కంటే ఎక్కువగా కష్టపడి ప్రాక్టీస్ చేశాడు. తన ప్రదర్శనతో ప్రపంచానికి తానంటే చూపించాడు. గత రెండు నెలల్లో టీమ్ఇండియాకు అతడు ఏం చేశాడో.. జీవితకాలంలో ఏ ఆటగాడు అలాంటి మెరుగైన ప్రదర్శన ఇవ్వలేదని నేను భావిస్తున్నా. కీపింగ్‌లోనూ అతడు అత్యుత్తమంగా ఉన్నాడు."
- రవిశాస్త్రి, టీమ్ఇండియా ప్రధానకోచ్
జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమ్ఇండియాకు దక్కిన విజయంలో యువ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్‌దే కీలకపాత్ర. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఒక సెంచరీతో పాటు రెండు అర్ధ సెంచరీలను నమోదు చేశాడు. కష్ట సమయాల్లో పరుగులు రాబడుతూ జట్టులో మెరుగైన ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో 3-1తో టీమ్ఇండియా గెలుపొందింది. ఈ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కోహ్లీ సేన అడుగుపెట్టింది. లార్డ్స్ వేదికగా జరగనున్న ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్‌తో టీమ్ఇండియా తలపడనుంది.
ఇదీ చూడండి: ఇంగ్లాండ్ ఓటమికి కారణమదే: గావస్కర్