ETV Bharat / sports

భారత్​తో నాలుగో టెస్టుకు ఇంగ్లాండ్​ స్క్వాడ్​ ఇదే.. - భారత్Xఇంగ్లాండ్

టీమ్​ఇండియాతో జరగనున్న నాలుగో టెస్టు జట్టును ఎంపిక చేసింది ఇంగ్లాండ్ క్రికెట్​ బోర్డు. పేసర్​ మార్క్​ వుడ్, ఆల్​ రౌండర్ క్రిస్ వోక్స్​కు జట్టులో అవకాశం కల్పించింది.

england
ఇంగ్లాండ్
author img

By

Published : Aug 29, 2021, 11:23 PM IST

భారత్​-ఇంగ్లాండ్​ మధ్య జరగనున్న నాలుగో టెస్టుకు జట్టును ప్రకటించింది ఇంగ్లాండ్ క్రికెట్​ బోర్డు. పేసర్​ మార్క్​ వుడ్, ఆల్​ రౌండర్ క్రిస్ వోక్స్​కు​ టీమ్​లో చోటు కల్పించింది. అయితే.. జాస్​ బట్లర్​ మాత్రం జట్టుకు దూరం కానున్నాడు. అతడి​ భార్య లూయిస్..​ త్వరలో రెండో బిడ్డకు జన్మనివ్వనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాడతడు.
లార్డ్స్​ వేదికగా జరిగిన రెండో టెస్టులో వుడ్​ కుడి భుజానికి గాయమైంది. ఈ కారణంగా మూడో టెస్టుకు దూరమైన వుడ్​.. మళ్లీ జట్టులో చేరాడు. బట్లర్​ స్థానాన్ని బెయిర్​ స్టో భర్తీ చేయనుండగా, సామ్ బిల్లింగ్స్ వికెట్​ కీపర్​గా ఆడనున్నాడు.
సెప్టెంబరు 2నుంచి ఇరు జట్లు ఓవల్​ వేదికగా నాలుగో టెస్టులో తలపడనున్నాయి. మొత్తం ఐదు మ్యాచ్​ల సిరీస్​ను​ ఇప్పటి వరకు ఇరు జట్లు 1-1తో సమం చేశాయి.
ఇంగ్లాండ్ స్క్వాడ్:
జో రూట్ (కెప్టెన్)​, మోయిన్ అలీ, జేమ్స్ అండర్సన్, బెయిర్​ స్టో, సామ్ బిల్లింగ్స్, రోరీ బర్న్స్, సామ్ కరణ్​, హసీబ్ బమీద్, డాన్ లారెన్స్, డేవిడ్ మలన్, క్రయాగ్ ఓవర్టన్, ఒల్లీ పోప్, ఓల్లీ రాబిన్సన్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్.

ఇదీ చదవండి:IND Vs ENG: కోహ్లీని ఎలా ఔట్‌ చేయాలంటే.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.