ఇంగ్లాండ్ టీమ్‌కు బ్యాటింగ్ కోచ్‌గా మాజీ బ్యాట్స్‌మన్ మార్కస్ ట్రెస్కోథిక్‌ను ఆ దేశ క్రికెట్ బోర్డు నియమించింది. వీరితో పాటు పేస్ బౌలింగ్ కోచ్‌గా జోన్ లూయిస్, స్పిన్ కోచ్‌గా జీతన్ పటేల్‌ను ఎంపిక చేసినట్లు సోమవారం ఓ ప్రకటనలో తెలియజేసింది.
ప్రస్తుతం సోమర్సెట్ కంట్రీ క్రికెట్ క్లబ్‌కు అసిస్టెంట్ కోచ్‌గా పనిచేస్తున్న మార్కస్ ట్రెస్కోథిక్.. మార్చి రెండో వారం నుంచి బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. మరోవైపు యంగ్ లైయన్స్ ప్రధానకోచ్‌గా ఉన్న లూయిస్.. పేస్ బౌలింగ్ కోచ్‌గా పదోన్నతి సాధించాడు. న్యూజిలాండ్‌కు చెందిన మాజీ స్పిన్నర్ జీతన్ పటేల్.. ఇంగ్లాండ్ జట్టు శాశ్వత స్పిన్ బౌలింగ్ కోచ్‌గా నియమితుడయ్యాడు.
ఇదీ చూడండి: ఇంగ్లీష్ జట్టుపై వసీమ్ జాఫర్ ఫన్నీ కామెంట్..