ETV Bharat / sports

పీకల్లోతు కష్టాల్లో భారత్​​.. లంచ్​ సమయానికి 144/6 - కష్టాల్లో భారత్​.. లంచ్​ సమయానికి 144/6

చెన్నై టెస్టులో భారత బ్యాట్స్​మెన్ తడబడుతున్నారు. పిచ్ బౌలింగ్​కు సహకరిస్తుండటం ఇంగ్లాండ్​కు కలిసొస్తుంది. లంచ్​ సమయానికి టీమ్​ఇండియా 144/6 పరుగులు చేసింది. క్రీజులో విరాట్​ కోహ్లీ, అశ్విన్​ ఉన్నారు.

lunch time in first test day five
ఎదురీదుతున్న భారత్​.. లంచ్​ సమయానికి 144/6
author img

By

Published : Feb 9, 2021, 11:42 AM IST

మొదటి టెస్టు రెండో ఇన్నింగ్స్​లో భారత్ పీకల్లోతు​ కష్టాల్లో ఉంది. భోజన విరామ సమయానికి 6 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ(45), అశ్విన్(2) ఉన్నారు. ఓవర్​నైట్​ స్కోరు 39/1తో అయిదవ రోజు ఆట కొనసాగించిన భారత్​కు​ ఆదిలోనే షాక్​ తగిలింది. కుదురుకుంటున్నట్లు కనిపించిన పుజారాను లీచ్​ ఔట్​ చేశాడు.

ఒకే ఓవర్లో రెండు..

పిచ్​ నుంచి లభిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకున్న ఇంగ్లాండ్​ పేసర్​ అండర్సన్​ ఒకే ఓవర్లో ఇద్దరిని ఔట్​ చేశాడు. అర్ధ సెంచరీతో ఊపు మీద కనిపించిన గిల్​.. అండర్సన్ వేసిన ఇన్​స్వింగ్​కు పెవిలియన్​ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఆజింక్య రహానెను చక్కటి డెలివరీతో బౌల్డ్​ చేశాడు అండర్సన్​. తొలి ఇన్నింగ్స్​లో ఒక్క పరుగు మాత్రమే చేసిన రహానె, ఈ ఇన్నింగ్స్​లో డకౌట్​గా వెనుదిరిగాడు.

రిషభ్​పంత్​ 11 పరుగులు చేసి క్యాచ్​ ఔటయ్యాడు. తొలి ఇన్నింగ్స్​లో హాఫ్​ సెంచరీతో ఆకట్టుకున్న సుందర్​ డకౌటయ్యాడు. భారత్​ ఓటమి నుంచి తప్పించుకోవాలంటే కోహ్లీ ఎక్కువ సేపు క్రీజులో ఉండక తప్పదు.

ఇదీ చదవండి: 'విరాట్.. అంపైర్లను ప్రభావితం చేస్తున్నాడు!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.