32ఏళ్లుగా గబ్బాలో ఓటమి అంటూ ఎరుగని ఆస్ట్రేలియా జట్టును.. ఈ ఏడాది ప్రారంభంలో టీమ్ఇండియా ఓడించింది. నాలుగు టెస్టుల సిరీస్‌లోని ఆఖరి మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో చారిత్రక విజయాన్ని నమోదు చేసింది భారత్. ఆ విజయంతో సిరీస్ కైవసం చేసుకోవడమే కాకుండా.. బోర్డర్-గావస్కర్ ట్రోఫీని వరుసగా మూడోసారి సొంతం చేసుకుంది. అంతటి చరిత్ర కలిగిన ఆసీస్ జట్టును వారి త గడ్డపై ఓడించడం అంటే మాటలా?
ఇప్పుడు అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ మరో సరికొత్త ఘనతను టీమ్ఇండియా తన ఖాతాలో వేసుకుంది. ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో విజయం సాధించడమే కాక.. ఏళ్ల నాటి చరిత్రను కోహ్లీసేన తిరగరాసింది. గత 50 ఏళ్లుగా ఓవల్ పిచ్‌పై(నాలుగో టెస్టు జరిగిన పిచ్) ఇంగ్లాండ్ జట్టు ఓటమి ఎరుగులేదు. అదే విధంగా ఆ వేదికపై భారత జట్టు.. ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఇప్పుడా లెక్కలు మారాయి! కోహ్లీసేన సరికొత్త రికార్డును సృష్టించింది. ఓవల్ పిచ్‌పై ఓటమి అంటే తెలియని ఇంగ్లీష్ జట్టును మట్టికరిపించింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో గెలవడమే కాకుండా.. సిరీస్ ఆధిక్యంలోకి వెళ్లింది. ఇంతటి చారిత్రక విజయాన్ని నమోదు చేసిన భారత జట్టును.. పలువురు ప్రముఖులు కొనియాడుతున్నారు.
అంతకుముందు వర్షం కారణంగా తొలి టెస్టు రద్దు కాగా.. ఆ తర్వాత లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఏడేళ్ల తర్వాత విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఈ సిరీస్‌లో భారత జట్టు తొలి గెలుపును నమోదు చేసింది. లీడ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో భారత జట్టు ఓడింది. ఇప్పుడు నాలుగో టెస్టులో గెలిచి.. సిరీస్ ఆధిక్యంలోకి వెళ్లింది కోహ్లీసేన.
ఇదీ చూడండి.. IND Vs ENG: నాలుగో టెస్టులో టీమ్ఇండియా ఘనవిజయం