ETV Bharat / sports

WTC points Table: ఇంగ్లాండ్​పై విజయం.. అగ్రస్థానంలో భారత్ - వరల్డ్ టెస్టు ఛాంపియన్​ షిప్ టేబుల్

ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్ పాయింట్ల పట్టికలో(WTC Table) టీమ్​ఇండియా టాప్​లో నిలిచింది. ఇంగ్లాండ్​పై నాలుగో టెస్టులో గెలిచిన అనంతరం ఈ ఘనత సాధించింది భారత జట్టు.

team india
భారత జట్టు
author img

By

Published : Sep 7, 2021, 11:00 AM IST

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్(2021-2023) పాయింట్ల పట్టికలో(WTC Points Table 2021-2023) టీమ్​ఇండియా టాప్​లో నిలిచింది. ఇంగ్లాండ్​పై నాలుగో టెస్టు గెలిచిన అనంతరం ఈ స్థానం దక్కించుకుంది. ఓవల్​ వేదికగా జరిగిన ఈ టెస్టు మ్యాచ్​లో(Ind vs Eng 4th test) 157 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది కోహ్లీసేన.

ఇంగ్లాండ్​తో నాలుగో టెస్టులో విజయం అనంతరం డబ్ల్యూటీసీ టేబుల్​లో 26 పాయింట్లతో టీమ్​ఇండియా అగ్రస్థానం దక్కించుకుంది. ప్రస్తుతం భారత జట్టు పాయింట్ల పర్సెంటేజ్ 54.17 శాతంగా ఉంది. ఇంగ్లాండ్​ 14 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండగా పాకిస్థాన్​ 12 పాయింట్లు, 50 శాతం పాయింట్ల పర్సెంటేజ్​తో రెండో స్థానంలో నిలిచింది. వెస్టిండీస్ మూడో స్థానంలో కొనసాగుతోంది.

నాలుగో టెస్టు సాగిందిలా(Ind vs Eng 4th Test Highlights)

తొలి ఇన్నింగ్స్​లో 191 పరుగులకే కుప్పకూలింది భారత్. ఈ మ్యాచ్​లో కెప్టెన్ విరాట్​ కోహ్లీ(50), శార్దూల్​ ఠాకూర్​(57) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. ఇంగ్లాండ్​ బౌలర్లలో క్రిస్​ వోక్స్​ 4 వికెట్లు పడగొట్టగా.. రాబిన్సన్ 3, జేమ్స్​ అండర్సన్​, క్రెయిగ్​ ఓవర్టన్​ చెరో వికెట్​ సాధించారు. ఆ తర్వాత బరిలో దిగిన ఆతిథ్య జట్టు.. 290 పరుగులకే ఆలౌటైంది.

రెండో ఇన్నింగ్స్​లో 466 పరుగులు చేసి.. 367 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్​ ముందుంచింది టీమ్​ఇండియా. ఈ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్​ 210 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా కోహ్లీసేన ఘన విజయం సాధించింది. 50 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ఓవల్​ మైదానంలో టెస్టు మ్యాచ్ గెలిచి చరిత్ర సృష్టించింది.

ఇదీ చదవండి:

'ప్రపంచంలోనే భారత్ అత్యుత్తమ జట్టు'

IND Vs ENG: నాలుగో టెస్టు హైలైట్స్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.