ETV Bharat / sports

పంత్​ ధనాధన్​.. 329 పరుగులకు భారత్​ ఆలౌట్​

రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్​లో భారత్​ 329 పరుగులకు ఆలౌటైంది. పంత్​ ధనాధన్​ ఇన్నింగ్స్​తో 50 పరుగులు పూర్తి చేశాడు. ఇంగ్లాండ్​ బౌలర్లలో అలీ 4 వికెట్లు తీశాడు.

india all out in second test first innings
పంత్​ హాఫ్​సెంచరీ.. 329 పరుగులకు భారత్​ ఆలౌట్​
author img

By

Published : Feb 14, 2021, 10:11 AM IST

Updated : Feb 14, 2021, 10:49 AM IST

చెపాక్​ వేదికగా ఇంగ్లాండ్​తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో టీమ్​ఇండియా 329 పరుగులకు ఆలౌటైంది. రెండో రోజు.. పంత్​ అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇంగ్లాండ్​ బౌలర్లలో మొయిన్​ అలీ 4 వికెట్లు తీశాడు.

ఓవర్​నైట్​ స్కోరు 300/6తో రెండో రోజు ఆట కొనసాగించిన భారత్​కు మొదటి ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. అక్షర్ పటేల్​​.. అలీ బౌలింగ్​లో స్టంపౌట్​ అయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లో.. క్రీజులోకి వచ్చిన ఇషాంత్​ను అలీ వెనక్కి పంపాడు.

ఓ ఎండ్​లో పంత్​ ధనాధన్​ ఇన్నింగ్స్​ ఆడుతున్నా.. మరోవైపు అతడికి సహకారం అందించే వారు కరువయ్యారు. పరిస్థితిని ఊహించిన పంత్​ ఉన్నంత సేపు ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఒకానొక సందర్భంలో ఇంగ్లాండ్​ కెప్టెన్​ రూట్​ ఫీల్డర్లను బౌండరీల దగ్గర ఉంచడం విశేషం. తర్వాత కుల్​దీప్​, సిరాజ్​లూ వెంటనే ఔటయ్యారు. దీంతో ఇండియా 329 పరుగుల వద్ద ఆగిపోయింది. పంత్​ 58 పరుగులతో అజేయంగా నిలిచాడు.

161 పరుగులతో రోహిత్​ శర్మా భారత ఇన్నింగ్స్​ టాప్​ స్కోరర్​గా నిలిచాడు. రహానే, పంత్​ ఆటతో ఇంగ్లాండ్​పై పట్టు సాధించే స్కోరు చేయగలిగింది భారత్​.

ఇదీ చదవండి: 'గంగూలీ-డోనా'.. ఏక్ ప్రేమ్ కహానీ!

Last Updated : Feb 14, 2021, 10:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.