ETV Bharat / sports

తొలి టెస్టు నుంచి అక్షర్​ ఔట్, వారికి చోటు

మరికాసేపట్లో ఇంగ్లాండ్​తో తొలి టెస్టులో తలపడనుంది టీమ్​ఇండియా. గాయం కారణంగా తొలి టెస్టుకు ఆల్​రౌండర్​ అక్షర్​​ పటేల్ దూరమైనట్లు బీసీసీఐ వెల్లడించింది.

Ind vs Eng: Axar Patel ruled out of first Test; Shahbaz Nadeem, Rahul Chahar added to hosts squad
భారత్ x ఇంగ్లాండ్: తొలి టెస్టు నుంచి అక్సర్​ ఔట్, వాళ్లిద్దరికి చోటు
author img

By

Published : Feb 5, 2021, 8:36 AM IST

Updated : Feb 5, 2021, 9:01 AM IST

ఇంగ్లాండ్​తో జరిగే నాలుగు మ్యాచ్​ల టెస్టు సిరీస్​లో ఆరంభ మ్యాచ్​కు దూరమయ్యాడు టీమ్​ఇండియా ఆల్​రౌండర్ అక్షర్​ పటేల్. మోకాలు నొప్పి కారణంగా వైదొలిగినట్లు బీసీసీఐ వెల్లడించింది. ప్రస్తుతం అతడు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు.

అక్షర్​ తప్పుకోవడం వల్ల స్పిన్నర్లు షాబాజ్ నదీమ్, రాహుల్ చాహర్​లను జట్టులోకి తీసుకుంటున్నట్లు బీసీసీఐ తెలిపింది. స్టాండ్​బై బృందంలో భాగంగా కొన్నాళ్లుగా టీమ్​ఇండియాతో శిక్షణలో ఉన్నారు నదీమ్, చాహర్.

మైదానంలో ప్రేక్షకుల సందడి..

శుక్రవారం మొదలయ్యే తొలి టెస్టు ప్రేక్షకులు లేకుండానే జరగనుంది. అయితే రెండో టెస్టుకు 50 శాతం మంది ప్రేక్షకులను అనుమతిస్తున్నట్లు తమిళనాడు క్రికెట్ సంఘం నిర్ధరించింది. రెండు మ్యాచ్​లు చెన్నైలోని ఎంఏ చిదంబరం మైదానంలోనే జరగనున్నాయి.

ఇదీ చూడండి: భారత గడ్డపై అంతర్జాతీయ క్రికెట్ - ఏడాది తర్వాత తొలిసారి

Last Updated : Feb 5, 2021, 9:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.