ETV Bharat / sports

Ind vs Eng: 'ఇంగ్లాండ్​తో ఆఖరి టెస్టు అనుమానమే' - ఐపీఎల్​ 2021

ఇంగ్లాండ్​-టీమ్​ఇండియా ఐదో టెస్టుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మన జట్టులోని ఫిజియోకు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ కావడమే ఇందుకు కారణం.

BCCI President Sourav Ganguly: We don't know if match will happen at this moment
ఇంగ్లాండ్​తో ఆఖరి టెస్టు అనుమానమే: గంగూలీ
author img

By

Published : Sep 9, 2021, 8:23 PM IST

టీమ్ఇండియా శిబిరంలో కరోనా కేసులు(Corona Cases in Indian Team) కలవరపెడుతున్న వేళ.. ఇంగ్లాండ్​తో ఆఖరి టెస్టుపై సందేహాలు తలెత్తుతున్నాయి. జట్టు జూనియర్​ ఫిజియో యోగేశ్​ పరామర్​కు గురువారం కరోనా సోకినట్లు తేలడమే ఇందుకు కారణం.​ ఇదే విషయమై భారత క్రికెట్​ నియంత్రణ మండలి(BCCI) అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ స్పందించాడు.

"టీమ్ఇండియా శిబిరంలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ఆఖరి టెస్టు జరుగుతుందా? లేదో కూడా చెప్పలేం" అని​ గంగూలీ ఓ ప్రకటనలో తెలిపారు.

ఓవల్​ వేదికగా జరిగిన నాలుగో టెస్టు జరుగుతున్నప్పుడే కోచ్​ల బృందంలో కరోనా కేసులు వచ్చాయి. అయినా ఆటగాళ్లకు కరోనా నెగెటివ్​గా తేలడం వల్ల మ్యాచ్​ను కొనసాగించారు. అయితే జట్టులోని స్టార్​ ఆటగాళ్లు అయిన కెప్టెన్​ విరాట్ కోహ్లీ, రోహిత్​ శర్మ, జస్ప్రిత్​ బుమ్రా, శార్దూల్​ ఠాకూర్​, రిషబ్​ పంత్​లలో ఎవరికైనా ఒకవేళ వైరస్ సోకితే బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో?

స్టార్​ ఆటగాళ్లకు కరోనా సోకితే..

కోహ్లీ, రోహిత్​ శర్మ, పంత్​ వంటి ఐపీఎల్​ కెప్టెన్లకు కరోనా సోకితే మాత్రం.. సెప్టెంబరు 19 నుంచి జరగనున్న ఐపీఎల్​ మ్యాచ్​లకు అందుబాటులో ఉండకపోవచ్చు. ఈ ప్రభావం టీ20 ప్రపంచకప్​లో(ICC T20 World Cup) పాల్గొనే భారత జట్టుపై పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆఖరి టెస్టు జరుగుతుందా? లేదా? అనే దానిపై సర్వత్రా చర్చ నడుస్తుంది.

ఐదుకు చేరిన కేసులు

టీమ్ఇండియా కోచ్​ బృందంలోని ప్రధానకోచ్​ రవిశాస్త్రి(Ravi Shastri Corona), బౌలింగ్​​ కోచ్ భరత్​ అరుణ్​​, ఫీల్డింగ్​ కోచ్​ ఆర్​.శ్రీధర్​, ఫిజియో నితిన్​ పటేల్​ ఇటీవలే కరోనా బారిన పడి ఐసోలేషన్​లో ఉన్నారు. ప్రస్తుతం జూనియర్​ ఫిజియో యోగేశ్​ పరామర్​కు పాజిటివ్​ వచ్చింది. దీంతో భారత బృందంలో కరోనా కేసుల సంఖ్య 5కు పెరిగింది.

ఇదీ చూడండి.. IND Vs ENG Preview: నిర్ణయాత్మక పోరులో గెలిచేది ఎవరు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.