ETV Bharat / sports

ఇంగ్లాండ్ టెస్టు జట్టుకు కొత్త కెప్టెన్... అతడికే పగ్గాలు.. - ఇంగ్లాండ్ సారథి బెన్ స్టోక్స్

Ben Stokes: ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. అందరూ ఊహించినట్టే.. టెస్టు జట్టు కెప్టెన్​గా బెన్ స్టోక్స్​ను నియమించింది.

BEN STOKES england test captain
BEN STOKES england test captain
author img

By

Published : Apr 28, 2022, 4:01 PM IST

England Test captain Ben Stokes: ఇంగ్లాండ్ టెస్టు సారథిగా బెన్​ స్టోక్స్​ను నియమించింది ఆ దేశ క్రికెట్ బోర్డు. జో రూట్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న నేపథ్యంలో అతడి స్థానంలో ఈ ఆల్​రౌండర్​ నియమిస్తూ ప్రకటన జారీ చేసింది. గత 17 టెస్టు మ్యాచ్​ల్లో ఒక్కటంటే ఒక్క మ్యాచ్​లోనే ఇంగ్లాండ్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో సారథి జో రూట్​పై తీవ్ర ఒత్తిడి ఏర్పడింది. ఈ క్రమంలోనే సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు రూట్.

మాజీ ఇంగ్లాండ్ బ్యాటర్ రాబ్​ కీ.. ఇంగ్లాండ్ బోర్డు పగ్గాలు చేపట్టిన వెంటనే కెప్టెన్సీపై నిర్ణయం తీసుకున్నారు. 'బెన్ స్టోక్స్.. టెస్టు పగ్గాలు స్వీకరించడానికి ఒప్పుకోవడం సంతోషకరం. జట్టును నడిపించేందుకు అతడు సిద్ధంగా ఉన్నాడు. ఈ అవకాశానికి అతడు పూర్తిగా అర్హుడు. ఇంగ్లాండ్ టెస్టు జట్టును నూతన శిఖరాలకు తీసుకెళ్లాలని అనుకుంటున్నామ'ని రాబ్ చెప్పుకొచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.