ETV Bharat / sports

'సీనియర్ల సలహాలతోనే ఇంగ్లాండ్ టూర్​​లో సక్సెస్'​ - ప్రపంచ టెస్టు ఛాేంపియన్​షిప్

సీనియర్ల సలహాలతో ఇంగ్లాండ్ పర్యటనలో విజయవంతం కావాలనుకుంటున్నట్లు వెల్లడించాడు న్యూజిలాండ్ యువ ఆల్​రౌండర్ కైల్ జేమీసన్. పిచ్, వాతావరణ పరిస్థితులు, డ్యూక్స్​ బంతులతో బౌలింగ్ వంటి విషయాలలో తనకు సహచరుల అనుభవాలు తోడ్పడతాయని అభిప్రాయపడ్డాడు.

Kyle Jamieson, New Zealand all-rounder
కైల్ జేమీసన్, కివీస్ యువ ఆల్​రౌండర్
author img

By

Published : May 26, 2021, 8:31 PM IST

ఇంగ్లాండ్​ పర్యటనలో విజయవంతం కావాలంటే తనకు సీనియర్ల సలహాలు తప్పనిసరి అని తెలిపాడు కివీస్ యువ ఆల్​రౌండర్ కైల్​ జేమిసన్. ఇంగ్లాండ్​లో తొలిసారి పర్యటిస్తున్న కైల్​.. ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ, నెయిల్ వాగ్నర్, బ్రాస్​వెల్​ వంటి బౌలర్ల నుంచి అనుభవాలను పంచుకోవాలని భావిస్తున్నాడు.

"టిమ్, వాగ్స్, బ్రాస్​వెల్​, హెన్రీ వంటి సీనియర్​ బౌలర్ల సలహాలు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. వీరికి ఇంగ్లాండ్​లో ఆడిన అనుభవం ఉంది. ఇక్కడి పిచ్​లు, వాతావరణ పరిస్థితుల పట్ల వారికి అపారమైన అనుభవం ఉంది. డ్యూక్స్​ బంతులతో ఎలా బంతులేయాలి.. అనే విషయాలను త్వరలోనే వారి నుంచి నేర్చుకుంటాను."

-కైల్ జేమీసన్, న్యూజిలాండ్ ఆల్​రౌండర్.

యూకే వేదికగా ఇంగ్లాండ్​తో రెండు టెస్టుల సిరీస్​ అనంతరం టీమ్ఇండియాతో డబ్ల్యూటీసీ ఫైనల్​లో జేమీసన్​ కివీస్​కు ఆడనున్నాడు. డ్యూక్ బంతితో బౌలింగ్ సవాలేనా అనే ప్రశ్నపై కైల్ స్పందించాడు. "అది కచ్చితంగా కాస్త వేరుగా ఉంటుంది. బంతి సీమ్ విషయానికొస్తే కొంత తేడా చూపిస్తుంది. డ్యూక్స్​ బంతుల గురించి అతిగా భయపడిన దానికంటే.. రాబోయే రోజుల్లో దానికి సంబంధించి చర్చిస్తే సరిపోతుంది" అని కైల్ పేర్కొన్నాడు.

ఇదీ చదవండి: ఐపీఎల్ రీషెడ్యూల్​కు ఆసీస్ ప్లేయర్లు​ దూరం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.