European Cricket Series : క్రికెట్‌లో జరిగే ఎన్నో ఘటనలు నవ్వు తెప్పించేలా ఉంటాయి. బ్యాటర్లు, బౌలర్లు, ఫీల్డర్లు చేసే కొన్ని ఫీట్ల వల్ల అప్పుడప్పుడు ఆ జట్టుకు నష్టం వాటిల్లుతుంది. అయితే, ఇలాంటివే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ట్రెండ్ సృష్టిస్తుంటాయి. తాజాగా ఓ క్లబ్ క్రికెట్‌లో జరిగిన ఓ సంఘటన అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతకీ అదేందంటే..
అంతర్జాతీయ క్రికెట్, ప్రాంఛైజీ లీగ్ ఇలా ఆట ఏదైనా ఓవర్ త్రో అనేవి చాలా కష్టం. అయితే అవి ఎప్పుడో ఒకసారి జరుగుతుంటాయి. కానీ తాజాగా జరుగుతున్న యూరోపియన్ క్రికెట్ లీగ్‌లో ఓవర్ త్రోలు మాత్రం సర్వసాధారణమయ్యాయి. ఈ క్రమంలోనే ఈ సరదా ఘటన జరిగింది.యునైటెడ్ క్రికెట్ క్లబ్- ప్రేగ్ టైగర్స్ జట్ల మధ్య టీ10 మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన టైగర్స్ అమీన్ హొస్సేన్ (20), సోజిబ్ మియా (30) రాణించడం వల్ల నిర్ణీత 10 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. అయితే పీయూష్‌సింగ్ బఘెల్ 23 బంతుల్లో 42 పరుగులు స్కోర్ చేసి సత్తాచాటడం వల్ల యునైటైడ్ జట్టు 9.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. అయితే యునైటైడ్ విజయానికి రెండు బంతుల్లో మూడు పరుగులు అవసరం.
-
Cricket at its wildest!🤯 #EuropeanCricket #EuropeanCricketSeries #StrongerTogether pic.twitter.com/J6BSLhqYqt
— European Cricket (@EuropeanCricket) July 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Cricket at its wildest!🤯 #EuropeanCricket #EuropeanCricketSeries #StrongerTogether pic.twitter.com/J6BSLhqYqt
— European Cricket (@EuropeanCricket) July 22, 2023Cricket at its wildest!🤯 #EuropeanCricket #EuropeanCricketSeries #StrongerTogether pic.twitter.com/J6BSLhqYqt
— European Cricket (@EuropeanCricket) July 22, 2023
ECS Czechia T10 : ఇక యునైటెడ్ బ్యాటర్లు ఆయుష్ శర్మ, అభిమన్యు సింగ్ క్రీజ్‌లో ఉన్నారు. టైగర్స్ బౌలర్ కట్టుదిట్టంగానే బంతిని సంధించాడు. కానీ దాన్ని కొట్టడంలో ఆయుష్ విఫలమయ్యాడు. అయితే, వికెట్ కీపర్ బాల్‌ను సరిగ్గా ఒడిసి పట్టలేకపోయాడు. ఇదే సరైన సమయంగా భావించిన బ్యాటర్లు పరుగు తీసేందుకు ప్రయత్నించారు. దీంతో వికెట్ కీపర్ వెంటనే బంతిని కాలితో వికెట్ల మీదకు తన్నాడు. కానీ అది స్టంప్స్‌ను తాకకుండా దూరంగా వెళ్లిపోయింది. అక్కడ ఎవరూ లేకపోవడం వల్ల బ్యాటర్లు రెండు పరుగులు పూర్తి చేశారు. ఇది చాలదన్నట్లు.. టైగర్స్ ఫీల్డర్లు కూడా గాబరా పడుతూ బంతిని విసిరేయడం వల్ల నేరుగా అది బౌండరీ లైన్ దాటేసింది. దీంతో మరో బంతి మిగిలి ఉండగానే యునైటెడ్ క్రికెట్ క్లబ్ విజయం సాధించింది.
అలా బ్యాటర్‌ను సునాయాసంగా రనౌట్ చేసే అవకాశాన్ని వికెట్ కీపర్ చేజార్చాడు. బంతిని చేత్తో పట్టుకోకుండా ఫుట్‌బాల్ తరహాలో కాలితో తన్నడం వల్ల రనౌట్ మిస్ అవ్వడంతో పాటు మ్యాచ్ కూడా ఓడిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటీజన్లు.. వికెట్ కీపర్ పని తీరుకు పగలబడి నవ్వుడంతో పాటు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.