ETV Bharat / sports

'ఒకే మైదానం- ఐదు పిచ్​లు'.. ఐపీఎల్​ కోసం బీసీసీఐ కొత్త ప్లాన్

Five pitches in IPL: ఐపీఎల్ గత సీజన్ పొరపాట్లను పునరావృతం కాకుండా చూడాలని బీసీసీఐ నిశ్చయించుకుంది. ఈ నేపథ్యంలోనే సరికొత్త ప్లాన్​ను అమలు చేస్తోంది. ఈసారి మ్యాచ్​లు జరిగే నాలుగు స్టేడియాలలో ఐదేసి పిచ్​లను సిద్ధం చేయిస్తోంది.

author img

By

Published : Mar 22, 2022, 4:21 PM IST

IPL 5 PICHES
IPL 2022 stadium pitches

Five pitches in IPL: కరోనా కారణంగా ఈసారి ఐపీఎల్ సీజన్​ మహారాష్ట్రలోనే నిర్వహిస్తోంది బీసీసీఐ. అక్కడి నాలుగు మైదానాలలో మ్యాచులు జరగనున్నాయి. అయితే, గత సీజన్​లో జరిగిన పొరపాట్లను ఈసారి రిపీట్ కాకుండా బీసీసీఐ జాగ్రత్త పడుతోంది. ప్రతి స్టేడియంలో ఐదు పిచ్​లను సిద్ధం చేస్తోంది.

IPL 2022 stadium pitches

2021 ఐపీఎల్ రెండో విడత యూఏఈలో నిర్వహించారు. అక్కడి స్టేడియంలలోని పిచ్​లు తొలుత బాగానే ఉన్నప్పటికీ.. మ్యాచ్​లు గడుస్తున్నా కొద్ది పూర్తిగా నెమ్మదించాయి. చివర్లో జరిగిన మ్యాచ్​లన్నీ తక్కువ స్కోర్లకే పరిమితమయ్యాయి. ఒకే స్టేడియంలో ఎక్కువ మ్యాచ్​లు వరుసగా నిర్వహించడం వల్ల ఈ సమస్య తలెత్తింది. అందుకే ఈసారి కొత్త ప్రణాళికతో ముందుకొచ్చింది. కొన్ని మ్యాచ్​ల తర్వాత పిచ్​లను మార్చుతూ ఉంటామని సంబంధిత వర్గాలు తెలిపాయి.

మార్చి 26 నుంచి ఐపీఎల్ మ్యాచ్​లు ప్రారంభం కానున్నాయి. గతేడాది ఫైనల్​లో తలపడిన చెన్నై, కోల్​కతాలు తొలి మ్యాచ్​లో ఢీకొట్టబోతున్నాయి. ఇప్పటికే అన్ని టీమ్​లు ప్రాక్టీస్ ముమ్మరం చేశాయి.

ఇదీ చదవండి: IPL 2022: గత సీజన్​లో తేలిపోయారు.. ఈసారి మురిపిస్తారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.