Dravid vs Kohli: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ నేపథ్యంలో ఆ దేశానికి చేరుకున్న భారత క్రికెటర్లు వెంటనే సాధన ఆరంభించేశారు. ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్‌ల ఆధ్వర్యంలో ఆటగాళ్ల సాధన సాగింది. అయితే.. ఈ సందర్భంగా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి బ్యాటింగ్‌లో సూచనలిచ్చాడు కోచ్ ద్రవిడ్. ఆ వీడియోను బీసీసీఐ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. మిగిలిన ఆటగాళ్లు ఫుట్‌బాల్ ఆడుతూ, రన్నింగ్ చేస్తూ వీడియోలో కనిపించారు.
-
Getting Test-match ready 👌 👌
— BCCI (@BCCI) December 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
🎥 Snippets from #TeamIndia's first practice session ahead of the first #SAvIND Test. pic.twitter.com/QkrdgqP959
">Getting Test-match ready 👌 👌
— BCCI (@BCCI) December 19, 2021
🎥 Snippets from #TeamIndia's first practice session ahead of the first #SAvIND Test. pic.twitter.com/QkrdgqP959Getting Test-match ready 👌 👌
— BCCI (@BCCI) December 19, 2021
🎥 Snippets from #TeamIndia's first practice session ahead of the first #SAvIND Test. pic.twitter.com/QkrdgqP959
South Africa vs India News:
ఇప్పటిదాకా టీమ్‌ఇండియా టెస్టు సిరీస్ గెలవని ఏకైక దేశం దక్షిణాఫ్రికా. 2011లో సిరీస్‌ను డ్రా చేసుకోవడాన్ని మినహాయిస్తే.. ప్రతి పర్యటనలోనూ ఓటములే ఎదుర్కొంది భారత్. అయితే ఈ నెల 26న ఆ దేశంలో మొదలయ్యే మూడు టెస్టుల సిరీస్‌లో మాత్రం కచ్చితంగా గెలిచి తీరాలనే పట్టుదలతో ప్రాక్టీస్ చేస్తోంది టీమ్. ప్రస్తుత దక్షిణాఫ్రికా బ్యాటింగ్ విభాగం బలహీనంగా కనిపిస్తున్న నేపథ్యంలో భారత్ సిరీస్ గెలవడానికి మంచి అవకాశాలే ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి: IND vs SA Test: కేఎల్ రాహుల్‌కు బంపర్ ఆఫర్.. రోహిత్ స్థానంలో