ETV Bharat / sports

టీమ్‌ఇండియాకు భారీ షాక్‌.. రాహుల్‌కు కరోనా పాజిటివ్‌ - కోచ్​ రాహుల్ ద్రవిడ్​కు కరోనా పాజిటివ్​

మరో నాలుగు రోజుల్లో ఆసియా కప్​ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమ్​ఇండియా భారీ షాక్ తగిలింది. రాహుల్​కు కరోనా సోకింది.

rahul dravid corona positive
రాహుల్ ద్రవిడ్ కరోనా పాజిటివ్​
author img

By

Published : Aug 23, 2022, 12:15 PM IST

Dravid corona positive మరో నాలుగు రోజుల్లో ఆసియా కప్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమ్​ఇండియాకు ఎదురుదెబ్బ తగిలింది. టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్​కు కరోనా సోకడమే ఇందుకు కారణం. దీంతో అతడు లేకుండానే భారత జట్టు యూఏఈకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. యూఏఈ వెళ్లే ముందు నిర్వహించిన పరీక్షల్లో ద్రవిడ్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే పాక్‌తో తొలి మ్యాచ్ ఆగస్టు 28 నాటికి ద్రవిడ్ కోలుకుని యూఏఈ వెళ్లే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.

జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌ ఆడిన టీమ్‌ఇండియాకు రాహుల్‌ ద్రవిడ్‌ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్‌ కోచింగ్‌ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ద్రవిడ్‌తోపాటు బ్యాటింగ్‌ కోచ్ విక్రమ్‌ రాఠోడ్, బౌలింగ్‌ కోచ్ పరాస్ మాంబ్రేకు సెలెక్షన్‌ కమిటీ ఆ సిరీస్‌ నుంచి విశ్రాంతినిచ్చింది. రోహిత్ శర్మ నాయకత్వంలో 15 మంది సభ్యుల భారత్ జట్టును ఆసియా కప్‌ కోసం ఎంపిక చేసింది. కేఎల్ రాహుల్‌ను వైస్‌ కెప్టెన్‌గా నియమించింది. విరాట్ కోహ్లీ, దినేశ్‌ కార్తిక్‌, హార్దిక్‌ పాండ్య వంటి సీనియర్లకు అవకాశం కల్పించింది. అయితే గాయం కారణంగా కీలక పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, హర్షల్‌ పటేల్, షమీ మెగా టోర్నీకి దూరమయ్యారు. స్టాండ్‌బై ఆటగాళ్లుగా అక్షర్‌ పటేల్, దీపక్‌ చాహర్, శ్రేయస్‌ అయ్యర్‌ను తీసుకుంది. ఒకవేళ ద్రవిడ్ అందుబాటులోకి రాకపోతే.. జింబాబ్వేతో సిరీస్‌కు కోచ్‌గా వ్యవహరించిన లక్ష్మణ్‌ ఆసియా కప్‌లోనూ కోచింగ్‌ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: గోపీచంద్​తో వివాదంపై పీవీ సింధు క్లారిటీ, అందుకే వచ్చేశానంటూ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.