ETV Bharat / sports

Rishabh Pant: 'పంత్​ కోసమే టెస్టులు చూస్తున్నా' - క్రికెట్ న్యూస్

అందివచ్చిన అవకాశాల్ని చక్కగా ఉపయోగించుకుని, అద్భుతంగా రాణిస్తున్న పంత్​పై పొగడ్తలు కురిపించాడు ఇంగ్లాండ్ క్రికెటర్. తాను ఆడుతున్నాడనే టెస్టు క్రికెట్​ చూస్తున్నానని అన్నాడు.

Rishabh Pant  Tymal Mills
పంత్
author img

By

Published : May 27, 2021, 7:10 PM IST

టీమ్​ఇండియా యువ వికెట్​కీపర్ రిషభ్ పంత్​ ఆట గురించి ప్రశంసించాడు ఇంగ్లాండ్ బౌలర్ టైమల్ మిల్స్. అతడు బ్యాటింగ్ కోసమే తాను టెస్టులు చూస్తున్నానని అన్నాడు. త్వరలో ఇంగ్లాండ్​ గడ్డపై ఆ దేశంతో భారత్ ఐదు టెస్టుల ఆడనున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశాడు.

"పరిమిత ఓవర్ల క్రికెట్​ నేను ఎక్కువగా ఆడతాను. గాయాలవడం వల్ల టెస్టుల్లో ఆడలేకపోయాను. ఆ మ్యాచ్​ల్ని కూడా ఎప్పుడు చూడను. అయితే పంత్​ బ్యాటింగ్​ చేస్తుంటే మాత్రం టెస్టుల్ని చూసేందుకు ఇష్టపడతాను. అతడు ఎన్నో అద్భుత ఇన్నింగ్స్​లు ఆడాడు కదా" అని మిల్స్ తెలిపాడు.

భారత్-ఇంగ్లాండ్ మధ్య ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 వరకు ఐదు టెస్టులు జరగనున్నాయి. అంతకంటే ముందు జూన్ 18న సౌతాంఫ్టన్​ వేదికగా న్యూజిలాండ్​తో ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్ ఫైనల్ ఆడనుంది కోహ్లీసేన.

ఇది చదవండి: IND VS ENG: భారత్​తో తొలి టెస్టుకు ఆర్చర్​ కష్టమే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.