ETV Bharat / sports

దేశవాళీ టీ20 టోర్నీల నిర్వహణ ఎప్పుడో? - ఐపీఎల్

సెప్టెంబర్​లో ప్రారంభం కావాల్సిన దేశీయ టీ20 క్రికెట్ సీజన్.. అనుకున్న సమయానికి ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. కరోనా కారణంగా ఐపీఎల్​ వాయిదా పడటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఐపీఎల్​ ముగిసిన తర్వాతనే ఈ సీజన్​ను నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది.

domestic cricket, bcci
దేశవాళీ క్రికెట్, బీసీసీఐ
author img

By

Published : Jun 30, 2021, 5:31 AM IST

ఈ ఏడాది రెండో విడత దేశవాళీ టీ20 క్రికెట్​ సీజన్​ ప్రారంభానికి సంబంధించి ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. సెప్టెంబర్​లో ప్రారంభం కావాల్సిన సీజన్​.. నిర్ణీత సమయానికి సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. కొవిడ్​ వల్ల ఐపీఎల్​ వాయిదా పడటమే ఇందుకు కారణం. దీంతో అక్టోబర్​ 15 తర్వాత సీజన్​ను ప్రారంభించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ​

సజావుగా సాగాల్సిన ఐపీఎల్​ 14వ సీజన్​ కరోనా వల్ల మే 4న వాయిదా పడింది. దేశంలో వైరస్​ కేసులు ఇంకా అదుపులోకి రాకపోవడం వల్ల మిగిలిన టోర్నీని యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్​ 15 వరకు నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. పలువురు దేశవాళీ క్రికెటర్లు ఐపీఎల్​లో ఆడుతున్నారు. దీంతో వారు స్వదేశానికి వచ్చాకే సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 వంటి టోర్నీలను ప్రారంభించనున్నట్లు సమాచారం.

ఇక ఐపీఎల్​ 15వ సీజన్​లో మరో రెండు కొత్త ఫ్రాంఛైజీలు లీగ్​లోకి అడుగుపెడుతున్నాయి. అందుకు సంబంధించిన వేలం త్వరలోనే ఉండే అవకాశం ఉంది. దీంతో దేశవాళీ క్రికెటర్లకు ముస్తాక్​ అలీ వంటి టీ20 టోర్నీలు కీలకం కానున్నాయి. అనుకున్న సమయానికి ఈ సీజన్​ ప్రారంభం కాకుంటే యువ క్రికెటర్లలో ఆసక్తి తగ్గే అవకాశం ఉంది.

దురదృష్టం ఏంటంటే, ఇప్పటివరకు దేశీయ సీజన్​కు సంబంధించి బీసీసీఐ అధికారికంగా ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. దేశంలో కొవిడ్ పరిస్థితులు ఇంకా తొలగిపొలేదు. దీంతో టీ20 ప్రపంచకప్​ కూడా దేశం నుంచి తరలిపోయింది. కాబట్టి, ఈ సీజన్​కు సంబంధించి బోర్డు వేచి చూసే ధోరణిని అవలంబిస్తుంది. టీ20లకు సంబంధించి టోర్నీలు సెప్టెంబర్​లో ఉండే అవకాశాలైతే లేవని చెప్పొచ్చు. ఇక కరోనా కారణంగా గతేడాది రంజీ ట్రోఫీ రద్దు కాగా, ఈ ఏడాది కూడా అది సజావుగా సాగే అవకాశాలు కనిపించడం లేదు.

ఇదీ చదవండి: 'ఆర్​ఆర్​ఆర్'​ పోస్టర్​పై కేన్​ మామతో వార్నర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.