భారత్‌లో దేశవాళీ క్రికెట్ సందడికి రంగం సిద్ధమైంది. కొవిడ్ కారణంగా గత సీజన్లో ఎలాంటి టోర్నీలు నిర్వహించలేకపోయిన బీసీసీఐ.. త్వరలోనే అన్ని వయసుల వారికి మ్యాచ్‌లు జరపనుంది. నవంబరు 16 నుంచి ప్రతిష్ఠాత్మక రంజీ ట్రోఫీ సహా 2021-22 సీజన్లో మొత్తం 2127 మ్యాచ్‌లను నిర్వహించనుంది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటన విడుదల చేశారు.
అక్టోబరు 20న ప్రారంభమయ్యే సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీతో ఈ ఏడాది పూర్తి స్థాయి దేశవాళీ సీజన్ ప్రారంభంకానుంది.
ఇవీ దేశవాళీ పూర్తి షెడ్యూల్ వివరాలు..
- 2021 సెప్టెంబరు 21 నుంచి సీనియర్ మహిళల వన్డే లీగ్ ప్రారంభం
- 2021 అక్టోబరు 27 నుంచి సీనియర్ మహిళల వన్డే ఛాలెంజర్ ట్రోఫీ
- 2021 నవంబరు 12న సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ఫైనల్
- 2021 నవంబరు 16 నుంచి 2022 ఫిబ్రవరి 19 వరకు రంజీ ట్రోఫీ
- 2022 మార్చి 26న విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్
దేశవాళీ సీజన్‌ను క్రికెటర్లు సహా అందరి ఆరోగ్య భద్రతలకు భరోసా ఇస్తూ నిర్వహిస్తామని బీసీసీఐ విశ్వాసం వ్యక్తం చేసింది.
ఇదీ చూడండి: India vs Srilanka: ప్రాక్టీస్ మొదలుపెట్టిన గబ్బర్‌సేన