Team India first T20I captain: టీమ్ఇండియా తన మొట్టమొదటి టీ20ని 2006లో దక్షిణాఫ్రికాతో ఆడింది. ఆ తర్వాత ఏడాది జరిగిన తొలి పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్‌ను సగర్వంగా ముద్దాడింది భారత జట్టు. ఈ టోర్నీలో జట్టుకు నాయకత్వం వహించి అందరి మన్ననలు పొందాడు ఎంఎస్ ధోనీ. అయితే టీమ్ఇండియా ఆడిన తొలి టీ20కి మాత్రం మహీ కెప్టెన్ కాదు. అవును మీరు విన్నది నిజమే. మరి ఆ మ్యాచ్‌కు సారథ్యం వహించింది ఎవరో తెలుసా?
డిసెంబర్ 1, 2006లో జోహన్నెస్‌బర్గ్ వేదికగా తన మొట్టమొదటి టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో భారత జట్టు తలపడింది. ఈ జట్టుకు వీరేంద్ర సెహ్వాగ్ నాయకత్వం వహించాడు. అయితే ఈ ఫార్మాట్లో సెహ్వాగ్ కెప్టెన్‌గా ఉన్న ఒకే ఒక్క మ్యాచ్ ఇదే. ఆ తర్వాత టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో సారథ్య బాధ్యతల్ని మారుస్తూ దోనీని కెప్టెన్‌గా నియమించారు. సెహ్వాగ్ సారథ్యం వహించిన తొలి టీ20లో టీమ్ఇండియా ఘనవిజయం సాధించింది. ఈ జట్టులో సచిన్‌తో పాటు దినేశ్ మోంగియా వంటి సీనియర్ ఆటగాళ్లు కూడా ఉన్నారు.
టీ20 ప్రపంచకప్ సమయంలో ఈ ఫార్మాట్ కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న ధోనీ.. ఆ తర్వాత ద్రవిడ్ నుంచి వన్డే కెప్టెన్సీ బాధ్యతలూ తీసుకున్నాడు. ఇతడి సారథ్యంలో 2007లో టీ20 ప్రపంచకప్‌తో పాటు 2011లో వన్డే ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది టీమ్ఇండియా.