ETV Bharat / sports

'నాకు ఆ అవకాశం వస్తే ధోనీ బుర్రను చదివేస్తా'

వికెట్​ కీపర్​, బ్యాట్సమెన్​ దినేశ్​ కార్తిక్​కు ఇతరుల ఆలోచనలను చదివే శక్తి వస్తే మొదట ధోనీ బుర్రను చదివేస్తాడట. ఈ విషయాన్ని బీసీసీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించాడు. ఈ ఇంటర్వ్యూలో డీకే ఇంకా ఏం విషయాలు చెప్పాడంటే..

d
d
author img

By

Published : Jun 12, 2022, 7:27 PM IST

తనకు ఇతరుల బుర్రలు చదివే అవకాశం వస్తే టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీపై ఆ అస్త్రాన్ని సంధిస్తానని అంటున్నాడు వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ దినేశ్‌ కార్తీక్‌. ఇటీవల భారత టీ20 లీగ్‌ 15వ సీజన్‌లో బెంగళూరు తరఫున మెరిసిన అతడు తిరిగి జాతీయ జట్టులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దక్షిణఫ్రికాతో రెండో టీ20కి ముందు బీసీసీఐ విడుదల చేసిన ఓ వీడియోలో మాట్లాడాడు. డీకేని పలు ప్రశ్నలు అడగ్గా.. ఇలా సరదాగా సమాధానాలిచ్చాడు.

ప్రశ్న: జట్టుతో డిన్నర్‌ చేయడం ఇష్టమా? సినిమాకు వెళ్లడం ఇష్టమా?

డీకే: టీమ్‌ డిన్నర్‌ అంటేనే చాలా ఇష్టం. ఆటగాళ్లతో భోజనం చేయడం బాగుంటుంది.

ప్రశ్న: టీ ఇష్టమా? కాఫీ ఇష్టమా?

డీకే: టీ ఇష్టం. భారత దేశంలో ఏ మూలకెళ్లినా దొరుకుతుంది.

ప్రశ్న: ఏదైనా పార్టీలో పాడటం ఇష్టమా? లేక డాన్స్‌ చేయడం ఇష్టమా?

డీకే: ఇది చాలా కష్టమైన ప్రశ్న. నేను రెండింటిలో ఏదీ చేయలేను.

ప్రశ్న: పర్వత ప్రాంతాలా? బీచ్‌లా?

డీకే: పర్వత ప్రాంతాలే ఇష్టం. నేను ఎక్కడ హిల్‌స్టేషన్‌కు వెళ్లినా.. అక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది.

ప్రశ్న: వంట చేయడమా? ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడమా?

డీకే: ఇంటిని శుభ్రం చేయడానికే ప్రాధాన్యతనిస్తా. శుభ్రంగా ఉండటం ఇష్టం.

ప్రశ్న: మీకు ఎగిరిపోవడం ఇష్టమా? లేక ఎవరిదైనా బుర్ర చదవడం ఇష్టమా?

డీకే: నాకు ఎగిరిపోయే అవకాశం వస్తే అలస్కా (అమెరికా) వెళ్లిపోతా. ఆ ప్రాంతం గురించి చాలా విషయాలు విన్నాను. అదే ఇతరుల బుర్ర చదివే అవకాశం వస్తే ధోనీ మైండ్‌ను చదివేస్తా.

ప్రశ్న: క్రిస్టియానో రొనాల్డో ఇష్టమా? లియోనెల్‌ మెస్సీనా?

డీకే: మెస్సీ అంటే చాలా ఇష్టం. అతడి ఆటను చూడటం మహా ఇష్టం.

ప్రశ్న: రోజర్‌ ఫెదరర్‌?రఫెల్‌ నాదల్‌?

డీకే: ఫెదరర్‌

ప్రశ్న: ఇన్‌స్టాగ్రామ్‌ లేదా ట్విటర్.. ఏది ఎక్కువ ఇష్టపడతారు?

డీకే: ట్విటర్‌కే ఓటేస్తా.

ప్రశ్న: ఫోన్‌ లేకుండా ఒకరోజు ఉంటారా? లేక వ్యాయామం చేయకుండా ఉంటారా?

డీకే: ఫోన్‌ లేకుండా ఉండటమే నాకు తేలికైన పని. దానికి అంతగా బానిస కాలేదు.

ప్రశ్న: లంబోర్గిని కారు ఇష్టమా లేక మస్టాంగ్‌ కారు ఇష్టమా?

డీకే: నాకు లంబోర్గిని అంటేనే ఇష్టం. దాని నుంచి వచ్చే శబ్దం బాగుంటుంది.

ప్రశ్న: నీ జీవితం మీద పుస్తకం రాయడం ఇష్టమా? సినిమా తీయడం ఇష్టమా?

డీకే: సినిమా అయితే బాగుంటుంది.

ఇదీ చూడండి : 'ఉమ్రాన్‌ మాలిక్‌కు టీ20 ప్రపంచకప్​లో ఛాన్స్​ ఇవ్వొద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.