ETV Bharat / sports

'రవి భాయ్‌.. నీవు నేర్పిన విద్యయే అది!'.. మాజీ కోచ్​కు డీకే చురకలు!! - దినేశ్​ కార్తీక్​ రవిశాస్త్రి వార్తలు

టీమ్​ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రికి వికెట్​ కీపర్​ దినేశ్​ కార్తీక్​ ఊహించని సమాధానమిచ్చాడు. తేలికైన గేమ్​ అంటూ ఏదీ ఉండదని తనకు నేర్పిన వ్యక్తుల్లో రవిభాయ్​ ఒకడని అన్నాడు. అసలు ఏం జరిగిందంటే..

dinesh karthik comments on ravisastri about his commentary in india australia t20 match

author img

By

Published : Sep 25, 2022, 4:56 PM IST

నాగ్‌పుర్​లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమ్‌ఇండియా వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ చివరి ఓవర్లో కొట్టిన షాట్లను తక్కువ చేసి చూపించేలా వ్యాఖ్యానించిన మాజీ కోచ్‌ రవిశాస్త్రికి ఊహించని సమాధానం ఎదురైంది. శుక్రవారం నాగ్‌పుర్‌లో జరిగిన మ్యాచ్‌ చివరి ఓవర్‌లో డీకే.. సిక్సు, ఫోర్‌ బాది భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. పోస్టు మ్యాచ్‌ ఇంటర్వ్యూ సందర్భంగా డీకే వద్దకు రవిశాస్త్రి వచ్చి "ఈజీ గేమ్‌, డీకే. రెండు బంతులు, చాలా తేలిక ('పీస్‌ ఆఫ్‌ కేక్‌' అనే నుడికారం వాడుతూ). సిక్స్‌, ఫోర్‌, ధన్యవాదాలు" అని ముగించాడు.

రవి శాస్త్రి మాటల్లోని వ్యంగ్యాన్ని డీకే అర్థం చేసుకొన్నాడు. దీనికి సమాధానం చెబుతూ రవిశాస్త్రి కోచింగ్‌ సంగతులను గుర్తు చేశాడు. "తేలికైన గేమ్‌ అంటూ ఏదీ ఉండదు అని నాకు నేర్పిన వ్యక్తుల్లో నువ్వు ఒకడివి. రవీభాయ్‌.. ప్లీజ్‌, ఇప్పుడు నువ్వే ఆ మాట నుంచి వెనక్కి తప్పుకోవద్దు. ఇది చాలా కష్టమైన గేమ్‌. ఎలానో నీకు బాగా తెలుసు" అంటూ కార్తీక్‌ సమాధానం ఇచ్చాడు. మూడేళ్లపాటు టీమ్‌ ఇండియాకు దూరమైన కార్తీక్‌ తీవ్రంగా శ్రమించి తిరిగి జట్టులో స్థానం దక్కించుకున్నాడు. పునరాగమనం తర్వాత నుంచి మ్యాచ్‌ ఫినిషర్‌గా రాణిస్తున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.