Dhoni Comments on Fan latter: చెన్నై కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఎప్పుడూ అభిమానులను అలరిస్తూనే ఉంటాడు. ఏ చిన్న అవకాశం దొరికినా వాళ్లని సంతోషపెడుతుంటాడు. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ఓ అభిమాని ధోనీపై తనకున్న ప్రేమను తెలియజేస్తూ దానిని అక్షరరూపంలో మార్చి ఓ లేఖ రాశాడు. ఎక్కడైతే చీకటి ఉంటుందో అక్కడ వెలుగులు నింపాపు. వెలుగులు ఉన్న చోట మరింత ప్రకాశింపజేశావంటూ లేఖను ప్రారంభించాడు. క్రికెటర్‌గానే కాకుండా ఓ వ్యక్తిగా తనను ప్రభావితం చేశాడంటూ మహీని ఆకాశానికెత్తేశాడు. వికెట్‌కీపర్, బ్యాటర్‌గా తన జీవితంలో భాగస్వామ్యమయ్యాడని పేర్కొన్నాడు.
ఇక ఆ లేఖను ధోనీకి చేరేలా చేశాడు. చివరికి అది చదివి సంతోషించిన చెన్నై కెప్టెన్ చాలా అద్భుతంగా రాశావంటూ మెచ్చుకున్నాడు. ఆ లేఖపై సంతకం కూడా పెట్టాడు. దీంతో చెన్నై టీమ్ ఆ లేఖను ఫ్రేమ్‌గా మలచి ఆ ఫొటోలను ట్విటర్‌లో అభిమానులతో పంచుకుంది. ఇక, ఈ సీజన్లో సీఎస్కే.. ప్లేఆఫ్స్‌కు చేరకుండానే ఇంటిముఖం పట్టింది.
-
Words from the 💛 framed for life &
— Chennai Super Kings (@ChennaiIPL) May 17, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
signed with 7⃣ove!#SuperFans #WhistlePodu #Yellove 🦁 pic.twitter.com/cpYgyTxBOI
">Words from the 💛 framed for life &
— Chennai Super Kings (@ChennaiIPL) May 17, 2022
signed with 7⃣ove!#SuperFans #WhistlePodu #Yellove 🦁 pic.twitter.com/cpYgyTxBOIWords from the 💛 framed for life &
— Chennai Super Kings (@ChennaiIPL) May 17, 2022
signed with 7⃣ove!#SuperFans #WhistlePodu #Yellove 🦁 pic.twitter.com/cpYgyTxBOI
ఇదీ చూడండి: ముంబయి చివరి మ్యాచ్‌లో సచిన్ కొడుకు అర్జున్‌కు ఛాన్స్!