ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్ రెండు స్థానాలు మెరుగుపరుచుకున్నాడు. ప్రస్తుతం 16వ స్థానంలో కొనసాగుతున్నాడు. శ్రీలంకతో సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో హాఫ్ సెంచరీతో రాణించడం గబ్బర్‌కు కలిసొచ్చింది.
అలాగే టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 848 పాయింట్లతో రెండో ర్యాంకులో ఉండగా.. మరో ఓపెనర్ రోహిత్ శర్మ 817 పాయింట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యాడు. ఇక ఈ విభాగంలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ 873 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
బౌలింగ్ విభాగానికొస్తే భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ నాలుగు స్థానాలు మెరుగుపరుచుకుని 20వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. లంక బౌలర్ హసరంగ ఏకంగా 22 స్థానాలు మెరుగుపరుచుకుని 36వ స్థానానికి ఎగబాకాడు. దక్షిణాఫ్రికా బౌలర్ తబ్రైజ్ షంషి ఎనిమిది స్థానాలు పైకి చేరి ప్రస్తుతం 39వ ర్యాంకులో ఉన్నాడు.
-
Pakistan wicketkeeper-batsman Mohammad Rizwan breaks into the top 10 of the @MRFWorldwide ICC Men's T20I Player Rankings for batting 👏
— ICC (@ICC) July 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Full list: https://t.co/77cLFa815E pic.twitter.com/T0AG8bwI8t
">Pakistan wicketkeeper-batsman Mohammad Rizwan breaks into the top 10 of the @MRFWorldwide ICC Men's T20I Player Rankings for batting 👏
— ICC (@ICC) July 21, 2021
Full list: https://t.co/77cLFa815E pic.twitter.com/T0AG8bwI8tPakistan wicketkeeper-batsman Mohammad Rizwan breaks into the top 10 of the @MRFWorldwide ICC Men's T20I Player Rankings for batting 👏
— ICC (@ICC) July 21, 2021
Full list: https://t.co/77cLFa815E pic.twitter.com/T0AG8bwI8t
టీ20 ర్యాంకింగ్స్..
ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, లోకేష్ రాహుల్ 5, 6 స్థానాల్లో కొనసాగుతున్నారు. పాకిస్థాన్ ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ కెరీర్ ఉత్తమ ర్యాంకుకు చేరుకున్నాడు. అతడు ప్రస్తుతం ఏడో ర్యాంకులో ఉన్నాడు. ఈ జాబితాలో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ డేవిడ్ మలన్ 841 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
ఇక బౌలర్ల జాబితాలో దక్షిణాఫ్రికా ఆటగాడు తబ్రైజ్ షంషీ తొలి స్థానాన్ని దక్కించుకున్నాడు.
ఇదీ చదవండి: Ind Eng Series 2021: కోహ్లీ, రహానె తొలి టెస్టు ఆడేనా?