టీమ్ఇండియా శ్రీలంకకు సోమవారం పయనమైంది. కెప్టెన్ శిఖర్ ధావన్ నేతృత్వంలో 20 మందితో కూడిన ఈ జట్టు.. మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఈ సందర్భంగా క్రికెటర్లు అందరూ ఉన్న ఫొటోను బీసీసీఐ ట్వీట్ చేసింది. ఈ జట్టుకు రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరించనున్నారు. జులై 13 నుంచి జులై 25 వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి.
-
All SET! 💙
— BCCI (@BCCI) June 28, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Sri Lanka bound 🇱🇰✈️#TeamIndia 🇮🇳 #SLvIND pic.twitter.com/eOMmiuxi28
">All SET! 💙
— BCCI (@BCCI) June 28, 2021
Sri Lanka bound 🇱🇰✈️#TeamIndia 🇮🇳 #SLvIND pic.twitter.com/eOMmiuxi28All SET! 💙
— BCCI (@BCCI) June 28, 2021
Sri Lanka bound 🇱🇰✈️#TeamIndia 🇮🇳 #SLvIND pic.twitter.com/eOMmiuxi28
అంతకు ముందు మీడియాతో ఆదివారం మాట్లాడిన ద్రవిడ్.. జట్టులోని యువ క్రికెటర్లకు ఇదో సువర్ణావకాశం అని అన్నారు. అందరికీ తుదిజట్టులో చోటు దక్కకపోవచ్చని, సీనియర్ల నుంచి వీలైనన్ని కొత్త విషయాలు తెలుసుకునేందుకు ఈ పర్యటన ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు.
జట్టు: శిఖర్ ధావన్(కెప్టెన్), పృథ్వీషా, దేవ్‌దత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీష్ యాదవ్, హార్దిక్ పాండ్య, నితీష్ రానా, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, యజవేంద్ర చాహల్, రాహుల్ చాహర్, కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్య, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, నవదీప్ సైనీ, చేతన్ సకారియా
నెట్ బౌలర్లు: ఇషాన్ పోరెల్, సందీప్ వారియర్, అర్షదీప్ సింగ్, సాయికిశోర్, సిమ్రజిత్ సింగ్
ఇది చదవండి: 'లంక టూర్.. వారికి ఇదొక సువర్ణావకాశం'