ETV Bharat / sports

అరంగేట్ర మ్యాచ్​లోనే అద్భుతం చేశారు

Debut Cricketers of Teamindia 2021: శ్రేయస్​ అయ్యర్​, అక్షర్​ పటేల్​, ఇషాన్​ కిషన్​, ప్రసిద్ధ్​ కృష్ణ సహా పలువురు ఆటగాళ్లు ఈ ఏడాది వివిధ ఫార్మాట్​లలో టీమ్ఇండియా తరఫున అరంగేట్రం చేశారు. తమ తొలి ఇన్నింగ్స్​లోనే ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించి తామేంటో నిరూపించుకున్నారు. ఓ సారి వారి ప్రదర్శనను నెమరువేసుకుందాం..

Debut Cricketers of Teamindia 2021
Debut Cricketers of Teamindia 2021, అరంగేట్ర మ్యాచ్​లోనే అదరగొట్టేశారు
author img

By

Published : Dec 28, 2021, 9:30 AM IST

Debut Cricketers of Teamindia 2021: ఈ ఏడాది టీమ్​ఇండియా తరఫున వివిధ ఫార్మాట్లలో అరంగేట్రం చేసిన పలువురు ఆటగాళ్లు తమ తొలి ఇన్నింగ్స్‌ల్లోనే సత్తాచాటారు. తొలి సారి క్రీజులో అడుగుపెట్టామన్న భయం లేకుండా బ్యాటర్లు.. మొదటిసారి బౌలింగ్‌ చేస్తున్నామనే బెరుకు లేకుండా బౌలర్లు అదరగొట్టారు. మొదటి అడుగులోనే అద్భుత ప్రదర్శన చేశారు. ఈ ఏడాది ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో వారెవరు? ఎలా ఆడారో ఓ సారి తెలుసుకుందాం..

అరంగేట్ర మ్యాచ్​లోనే సెంచరీ

Shreyas Iyer test century: శ్రేయస్​ అయ్యర్​కు తన తొలి టెస్టు​ ఆడటానికి దాదాపు నాలుగేళ్ల కన్నా ఎక్కువ సమయమే పట్టింది. ఈ ఏడాది న్యూజిలాండ్​తో జరిగిన రెండు మ్యాచ్​ల సిరీస్​తో టెస్టు​ అరంగేట్రం చేశాడు. మొదటి మ్యాచ్​లోనే సెంచరీతో అందరి దృష్టినీ తనవైపు తిప్పుకొన్నాడు. తొలి ఇన్నింగ్స్​లో 105, రెండో ఇన్నింగ్స్​లో 65 రన్స్​ చేసి ప్లేయర్​ ఆఫ్​ ది మ్యాచ్​ను అందుకున్నాడు. దీంతో అతడిపై అభిమానులు, దిగ్గజ క్రికెటర్లు ప్రశంసల వర్షం కరిపించారు. ప్రస్తుతం ఇతడు దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నాడు.

shreyas iyer
శ్రేయస్​ అయ్యర్​

ఐదు వికెట్ల ప్రదర్శన

Axar pates test debut: అక్షర్​ పటేల్​.. టీ20 ప్రపంచకప్​లో చోటు దక్కకపోయినప్పటికీ ఈ ఏడాది క్రికెట్​ అభిమానులు గుర్తిండిపోయే ప్రదర్శన చేశాడు. ఎందుకంటే తన టెస్టు​ అరంగేట్ర మ్యాచ్​లో అతడు చూపిన ప్రభావం అలాంటింది. జడేజా గైర్హాజరీతో భారత జట్టులో చోటు దక్కించుకున్న ఇతడు తనకు వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. ఫిబ్రవరిలో ఇంగ్లాండ్​తో జరిగిన రెండో టెస్టు​ మ్యాచ్​ రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో సహా మొత్తం ఏడు వికెట్లతో సత్తాచాటాడు. తన తొలి టెస్టు వికెట్‌గా ప్రపంచ అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడైన రూట్‌ను ఎదుర్కొన్న అతడు.. ఆ మ్యాచ్‌లో అశ్విన్‌తో కలిసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక రెండు రోజుల్లోనే ముగిసిన డేనైట్‌ టెస్టులో అక్షర్‌ ప్రదర్శన గురించి ఎంత చెప్పినా తక్కువే. గులాబీ బంతితో స్టంప్స్​నే టార్గెట్ చేసుకుని బౌలింగ్‌ చేసిన అతను ఆ మ్యాచ్‌లో 11 వికెట్లు పడగొట్టి జట్టుకు సంచలన విజయాన్ని అందించాడు. చివరి టెస్టులోనూ 9 వికెట్లతో మెరిశాడు. తన బంతులను ఆడలేక ప్రత్యర్థి బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. మొత్తం 3 మ్యాచ్‌ల్లో 27 వికెట్లతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు భారత్‌ అర్హత సాధించడంలో అక్షర్‌ ప్రధాన పాత్ర పోషించాడు.

axar patel
అక్షర్​ పటేల్​

జట్టుకు అండగా

Washington sundar test debut: ఈ ఏడాది మొత్తం దాదాపుగా గాయాలతో సతమతమైన ఆల్​రౌండర్​ వాషింగ్టన్​ సుందర్​ తన తొలి టెస్టు​ మ్యాచ్​లో మంచి ప్రదర్శన చేశాడు. ఆస్ట్రేలియాపై జరిగిన బ్రిస్బేన్​ టెస్టు​ మ్యాచ్​లో 144 బంతుల్లో 62 పరుగులు చేశాడు. ఏడో వికెట్​కు శార్దూల్​ ఠాకూర్​తో కలిసి 123 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరి ప్రదర్శన కష్టాల్లో ఉన్న జట్టుకు అండగా నిలిచింది. ఇక రెండో ఇన్నింగ్స్​లో 22 పరుగులు మాత్రమే ఇచ్చి 4వికెట్లు తీశాడు. మొత్తంగా ఈ ఏడాది 66.25 సగటుతో 265 పరుగులు చేశాడు.

టీమ్​​ఇండియాకు ఆడే అవకాశం

Venkatesh Iyer teamindia debut: ఐపీఎల్​ రెండో దశలో అదిరిపోయే ప్రదర్శన చేసి సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు వెంకటేశ్​ అయ్యర్​. పది మ్యాచ్​లు ఆడి 370 పరుగులతో ఆకట్టుకున్నాడు. దీంతో అతడికి టీమ్​ఇండియాకు ఆడే అవకాశం లభించింది. న్యూజిలాండ్​తో జరిగిన టీ20 సిరీస్​లో చోటు దక్కించుకున్న అతడు.. ఆల్​రౌండర్​గా సత్తా చాటాడు. మూడు వికెట్లతో పాటు బ్యాటింగ్​లోనూ మెప్పించాడు. ఐపీఎల్​ 2022 కోసం అతడిని 8కోట్లు వెచ్చించి రిటెయిన్​ చేసుకుంది కేకేఆర్​.

ధనాధన్..​ ఫటాఫట్​

Ishankishan T20 debut: మార్చిలో ఇంగ్లాండ్​తో జరిగిన సిరీస్​లో భాగంగా తొలి టీ20లోనే టీమ్​ఇండియా ఓడిపోయింది. అయితే బలంగా పుంజుకుని ఆ సిరీస్‌ను 3-2తో భారత్‌ సొంతం చేసుకోవడంలో ఇద్దరు అరంగేట్ర ఆటగాళ్లది కీలక పాత్ర. వాళ్లే ఇషాన్‌ కిషాన్, సూర్య కుమార్‌ యాదవ్‌. రెండో టీ20తో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఈ ఇద్దరూ తమ ప్రతిభను చాటారు. ఆ మ్యాచ్‌లో 165 పరుగుల ఛేదనలో ఓపెనర్‌గా వచ్చిన ఇషాన్‌ అనూహ్యంగా చెలరేగాడు. 32 బంతుల్లోనే 56 పరుగులు చేసి జట్టును విజయం దిశగా నడిపాడు. తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లో.. అది కూడా ఆర్చర్‌ లాంటి అగ్రశ్రేణి బౌలర్లను ఎదుర్కొంటూ అలవోకగా భారీ షాట్లు ఆడిన అతడి బ్యాటింగ్‌ అభిమానులను ఆకట్టుకుంది.

ishan kishan
ఇషాన్​ కిషన్​

Suryakumar T20 debut: ఇక ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేసే అవకాశం దక్కని సూర్యకుమార్‌.. నాలుగో టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సిరీస్‌ కోల్పోకూడదు అంటే కచ్చితంగా నెగ్గాల్సిన ఆ మ్యాచ్‌లో తొలిసారి అంతర్జాతీయ క్రికెట్లో బ్యాటింగ్‌కు వచ్చిన సూర్య అదరగొట్టాడు. ఆ మ్యాచ్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అతడు.. తాను ఎదుర్కొన్న తొలి బంతినే (ఆర్చర్‌ బౌలింగ్‌) సిక్సర్‌గా మలచిన విధానం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అర్ధశతకంతో చెలరేగిన తను మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ మెరుగైన స్కోరు చేయడంలో సాయపడ్డాడు. నిర్ణయాత్మక ఐదో టీ20లోనూ 17 బంతుల్లోనే 32 పరుగులు చేసి జట్టు విజయానికి దోహదపడ్డాడు.

వన్డే హీరోలయ్యారు

Krunal pandya ODI Debut: మార్చిలో ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌తో.. వన్డేల్లో అరంగేట్రం చేసిన ఆల్‌రౌండర్‌ కృనాల్‌ పాండ్యా, తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడిన పేసర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణ అంచనాలకు మించి రాణించారు. బ్యాట్‌తో కృనాల్, బంతితో ప్రసిద్ధ్‌ సత్తాచాటి జట్టుకు విజయాన్ని అందించారు. 260 పరుగులు కూడా చేయడం కష్టమనుకున్న జట్టును రాహుల్‌తో కలిసి ఏకంగా 300 దాటించాడు కృనాల్. దొరికిన బంతిని దొరికినట్లు బాదేసిన అతను కేవలం 26 బంతుల్లోనే అర్ధశతకం అందుకుని అరంగేట్ర వన్డే మ్యాచ్‌లో అత్యంత వేగంగా ఆ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

krunal pandya
కృనాల్​ పాండ్యా

Prasiddh Krishna ODI debut: ఇక తొలి అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌లో పేసర్‌ ప్రసిద్ధ్‌ అద్భుత ప్రదర్శన చేశాడు. కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను భారత్‌ వైపు తిప్పాడు. ఓపెనర్ల దూకుడుతో ఓ దశలో 14.1 ఓవర్లలోనే 135/0తో లక్ష్యం దిశగా దూసుకెళ్లిన ప్రత్యర్థికి అడ్డుపడ్డాడు. మొత్తంగా అరంగేట్ర వన్డేలో అత్యధిక వికెట్లు (4/54) తీసిన భారత బౌలర్‌గా రికార్డు నమోదు చేశాడు.

prasiddh krishna
ప్రసిద్ధ్​ కృష్ణ

ఆఖరి బంతికి సిక్స్​

KS Bharat last ball six: 2015 నుంచి ఐపీఎల్​కు ప్రాతినిధ్యం వహించినప్పటికీ ఈ ఏడాదే అతడు ఆర్సీబీ తరఫున ఈ మెగాటోర్నీలో అరంగేట్రం చేశాడు కేఎస్​ భరత్​. ఈ సీజన్​లో ఎనిమిది మ్యాచ్​లు ఆడి 122.43 సగటుతో 191 పరుగులు చేశాడు. ఫైనల్​ లీగ్​ స్టేజ్​ గేమ్​లో దిల్లీతో జరిగిన మ్యాచ్​లో చివరి బంతికి సిక్సర్​ బాది జట్టును విజయతీరాలకు చేర్చి ఒక్కసారిగా హీరో అయిపోయాడు.

Ks Bharat
కేఎస్​ భరత్​

అద్భుత ప్రదర్శన

Harshal Patel teamindia debut: ఐపీఎల్​ 2021లో హర్షల్​ పటేల్​ అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ సీజన్​లో 15 మ్యాచ్​లు ఆడిన అతడు 32 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. తన ప్రదర్శనతో టీమ్​ఇండియాకు ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఈ ఏడాది న్యూజిలాండ్​తో జరిగిన రెండో టీ20తో జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్​లో రెండు కీలక వికెట్లు తీసి ప్లేయర్​ ఆఫ్​ ద మ్యాచ్​గా నిలిచాడు. మొత్తంగా ఈ సిరీస్​లోని రెండు మ్యాచ్​ల్లో నాలుగు వికెట్లను దక్కించుకున్నాడు.

అత్యంత వేగంగా బౌలింగ్​

Umran Malik IPL debut: ఉమ్రన్​ మాలిక్​.. ఈ ఏడాది ఐపీఎల్​లో కోల్‌కతాతో జరిగిన ఓ మ్యాచ్‌తో సన్​రైజర్స్​ తరఫున అరంగేట్రం చేశాడు. ప్రధాన పేసర్‌ టి.నటరాజన్‌ కరోనా బారిన పడటం వల్ల ఆ స్థానాన్ని భర్తీ చేస్తూ జట్టు యాజమాన్యం ఈ యువపేసర్‌ను జట్టులోకి తీసుకుంది. ఈ క్రమంలోనే కోల్‌కతాపై తొలి మ్యాచ్‌ ఆడిన ఉమ్రన్‌.. ఈ సీజన్‌లో అత్యధిక వేగంగా బౌలింగ్‌ చేసిన భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గంటకు 150.06 కి.మీ వేగంతో బంతి సంధించి క్రికెట్‌ పండితుల మన్ననలు పొందాడు.

Umran malik
ఉమ్రన్​ మాలిక్​

ఇదీ చూడండి: ఈ ఏడాది టెస్టుల్లో 'సూపర్ స్టార్స్' వీరే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.