ETV Bharat / sports

ప్లీజ్ త్వరగా వచ్చేయండి డాడీ: వార్నర్ కూతురు - ప్లీజ్ త్వరగా వచ్చేయ్ డాడీ.. వార్నర్​ కూతురి పోస్ట్

ఇటీవలే కెప్టెన్సీ కోల్పోయిన సన్​రైజర్స్ హైదరాబాద్ క్రికెటర్ డేవిడ్ వార్నర్​ ఇన్​స్టాలో ఓ పోస్ట్ చేశాడు. ఇందులో తన కూతురు చిత్రీకరించిన ఓ ఫొటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

warner Daughters
వార్నర్​ కూతురి పోస్ట్
author img

By

Published : May 4, 2021, 8:46 PM IST

ఈ ఐపీఎల్​ సీజన్​ అర్ధాంతరంగా వాయిదా పడింది. దీంతో తన ఇన్​స్టా ఖాతాలో ఓ పోస్ట్ షేర్ చేశాడు సన్​రైజర్స్ హైదరాబాద్ క్రికెటర్ డేవిడ్ వార్నర్. ఇందులో ఉన్న ఫొటో నెటిజన్ల మనసుకు హత్తుకుంటోంది. అది వేసింది ఎవరో కాదు. వార్నర్ కూతురు ఇవీ. ఈ ఫొటో కాస్త ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారింది.

ఈ ఫొటోలో వార్నర్ కూతురు.. ఆమెతో పాటు సోదరీమణులు, తండ్రి వార్నర్, తల్లి క్యాండిస్​ చిత్రాలను పేపర్​పై ముద్దుగా చిత్రీకరించింది. ఈ ఫొటో కింద "ప్లీజ్ డాడీ ఇంటికి తొందరగా రండి. మేము మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం. ప్రేమతో ఇవీ, ఇండి, ఇస్లా" అని రాసుకొచ్చింది.

టోర్నీ వాయిదా కంటే ముందు వార్నర్​ను కెప్టెన్సీ నుంచి తప్పించింది సన్​రైజర్స్ హైదరాబాద్. అలాగే రాజస్థాన్ రాయల్స్​తో జరిగిన మ్యాచ్​లో తుదిజట్టులో చోటు ఇవ్వలేదు. తర్వాత మ్యాచ్​ల్లోనూ వార్నర్ ఆడేది అనుమానమే అని సన్​రైజర్స్ కోచ్ ట్రెవర్ బెయిలిస్ తెలిపాడు. దీనిపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జట్టుకు ఎంతో సేవ చేసిన ఆటగాడిని తొలగించడమేంటని ప్రశ్నిస్తున్నారు.

ప్రస్తుతం ఐపీఎల్ వాయిదా పడటం వల్ల ఆస్ట్రేలియా ఆటగాళ్లను వారి ఇళ్లకు పంపించేందుకు ప్రయత్నాలు చేస్తోంది బీసీసీఐ. అయితే వారు ఇప్పుడే వారి దేశానికి వెళ్లే వీలు లేదు. ఎందుకంటే భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది ఆస్ట్రేలియా. దీంతో మాల్దీవుల నుంచి వారి దేశానికి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఆసీస్ ఆటగాళ్లు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.