David Warner Coach: ఇంటర్నేషనల్ వన్డే, టెస్టు ఫార్మట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ ప్రస్తుతం టీ20ల్లో కొనసాగనున్నాడు. అయితే పొట్టి ఫార్మాట్‌కు కూడా వీడ్కోలు పలికిన తర్వాత క్రికెట్ నుంచి దూరం అవ్వాలని లేదట. అందుకే భవిష్యత్‌లో అవకాశం వస్తే కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించేందుకు ఆసక్తి చూపిస్తాడట. 'నేను కోచ్‌గా సమర్థంగా రాణించగలను. నా ఫ్యూచర్ గోల్ కూడా అదే. ఈ విషయం గురించి నా భార్యకు కూడా చెప్పాను. కోచ్‌గా బాధ్యతలు స్వీకరిస్తే ఏడాదిలో కొన్ని రోజులు దూరంగా ఉండాల్సి వస్తుందని చెప్పా' అని వార్నర్ అన్నాడు.
రెండు ఛాప్టర్లు ముగిశాయి: కెరీర్లో చివరి టెస్టు మ్యాచ్ ఆడేసిన వార్నర్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశాడు. 'నా కెరీర్లో రెండు ఛాప్టర్లు (వన్డే, టెస్టు) ముగిశాయి. ఇంకో అధ్యాయం (టీ20 ఫార్మాట్) మిగిలి ఉంది. ఇన్నేళ్ల కెరీర్లో ఎవరికీ ఇబ్బంది కలిగించలేదని అనుకుంటున్నా. ఇప్పటివరకు నా కెరీర్లో నాకు మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు' అని వార్నర్ తెలిపాడు.
David Warner Test Career: శనివారం (జనవరి 6) పాకిస్థాన్‌తో ఆఖరి టెస్టు మ్యాచ్ ఆడిన వార్నర్‌కు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ఘనమైన ఫేర్వెల్ దక్కింది. మ్యాచ్ అనంతరం వార్నర్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. అయితే 2011లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన వార్నర్ దాదాపు 14 ఏళ్లపాటు ఆసీస్ జాతీయ జట్టుకు సేవలందించాడు. రెడ్‌బాల్ ఫార్మాట్లో వార్నర్ తన కెరీర్లో 112 మ్యాచ్‌లు ఆడాడు. మొత్తం 205 ఇన్నింగ్స్‌లో 44.60 సగటుతో 8786 పరుగులు చేశాడు. కాగా, అందులో 26 సెంచరీలు (3సార్లు 200+ స్కోర్), 37 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
David Warner ODI Career: 2023 వరల్డ్‌కప్‌లో కెరీర్లో ఆఖరి మ్యాచ్ ఆడిన వార్నర్, ఇటీవల వన్డేలకు కూడా గుడ్‌బై చెప్పాడు. 2009లో సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్‌తో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. సుదీర్ఘంగా 14 ఏళ్లపాటు ఆసీస్ తరపున ప్రాతినిధ్యం వహిస్తూ జట్టుకు అనేక విజయాలు కట్టబెట్టాడు. తన కెరీర్లో ఇప్పటివరకు 161 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. 45.01 సగటుతో 6932 పరుగులు నమోదు చాశాడు. అందులో 22 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా, 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో జట్టుకు తన అవసరం ఉంటే కచ్చితంగా మళ్లీ ఆడతానని స్పష్టం చేశాడు.
14ఏళ్ల టెస్టు కెరీర్- అంచనాలకు మించి ఇన్నింగ్స్- బెస్ట్ 5 ఇవే!