Darren Bravo Retirement : వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ డారెన్ బ్రావో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని బ్రావో సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. 2009లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన బ్రావో.. 14 ఏళ్ల పాటు వెస్టిండీస్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఇక 34 ఏళ్ల లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ తన కెరీర్లో.. 122 వన్డే, 56 టెస్టు, 26 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి బ్రావో.. 7,052 పరుగులు చేశాడు. ఇందులో 12 శతకాలు, 35 అర్ధ శతకాలు ఉన్నాయి. బ్రావో చివరిసారిగా 2022 ఫిబ్రవరిలో ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు. అయితే ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ నేపథ్యంలో.. వెస్టిండీస్ జట్టుకు ఎంపిక కాని తర్వాత బ్రావో రిటైర్మెంట్ ప్రకటించడం గమనార్హం.
మాజీ క్రికెటర్ డ్వెన్ బ్రావో సోదరుడిగా క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన డారెన్ బ్రావో.. విండీస్ తరఫున అనేక కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తక్కువ కాలంలోనే బ్రావో.. జాతీయ జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్నాడు. మరోవైపు కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో.. 98 మ్యాచ్‌ల్లో 1956 పరుగులు చేశాడు. ఇక 2017లో ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చిన బ్రావో కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. అతడు కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించాడు.
-
NEWS ALERT: Darren Bravo announces his retirement from International cricket. pic.twitter.com/HYLTuJ9n5u
— CricTracker (@Cricketracker) November 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">NEWS ALERT: Darren Bravo announces his retirement from International cricket. pic.twitter.com/HYLTuJ9n5u
— CricTracker (@Cricketracker) November 26, 2023NEWS ALERT: Darren Bravo announces his retirement from International cricket. pic.twitter.com/HYLTuJ9n5u
— CricTracker (@Cricketracker) November 26, 2023
Narine Retirement : ఇటీవల ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 35 ఏళ్ల నరైన్.. తన కెరీర్లో అంతర్జాతీయంగా 65 వన్డే, 51 టీ20, 6 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 165 వికెట్లు పడగొట్టాడు. ఇక ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన నరైన్.. డొమెస్టిక్ లీగ్‌లలో యధావిథిగా ఆడనున్నట్లు స్పష్టం చేశాడు.
అయితే గతకొన్ని రోజులుగా వెస్టిండీస్ క్రికెట్ బోర్డులో వివాదాలు జరుగుతున్నాయి. అయితే ప్లేయర్లకు మ్యాచ్ ఫీజులు సరిగా చెల్లించట్లేదనే ఆరోపణలు కూడా విండీస్ బోర్డు ఎదుర్కొంది. దీంతో ఆటగాళ్లు జాతీయ జట్టులో ఆడడం కంటే.. ఆయా డొమెస్టిక్ లీగ్‌ల్లో ఆడేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పైగా రెండుసార్లు వన్డే ప్రపంచకప్ విజేత విండీస్.. 2023 వరల్డ్‌కప్‌నకు అర్హత సాధించకపోవడం పట్ల బోర్డు కూడా అంసతృప్తి చెందిందని తెలిసింది.
సునీల్ నరైన్ షాకింగ్ డెసిషన్ - ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై
క్రికెట్‌కు స్టార్ బౌలర్ గుడ్‌బై వరల్డ్‌కప్ తర్వాత రిటైర్మెంట్