CWC qualifier 2023 : వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ 2023 మ్యాచులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇందులో భాగంగా జూన్ 18 జరిగిన రెండు మ్యాచ్‌ల్లో మూడు శతకాలు నమోదయ్యాయి. నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే బ్యాటర్లు సీన్ విలియమ్స్ (70 బంతుల్లో 102*; 13x4, 1x6), క్రెయిగ్ ఎర్విన్ (128 బంతుల్లో 121*; 15x4,1x6) అజేయ శతకాలు సాధించగా.. వెస్టిండీస్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో యూఎస్‌ఏ ప్లేయర్ గజానంద్ సింగ్ (109 బంతుల్లో 101*; 8 x4, 2x6) మరో సెంచరీని కొట్టాడు. అలా రెండు వేరు వేరు మ్యాచుల్లో ముగ్గురు శతకాలు బాదారు. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే.. ఈ ముగ్గురు 35 ఏళ్ల వయసు వారు. అలానే ఈ ముగ్గురు బ్యాటర్లు నాటౌట్‌గా నిలవడం మరో విశేషం.
Sean williamson century : ఈ శతకాలు బాదిన వారిలో జింబాబ్వే ప్లేయర్ సీన్ విలియమ్స్.. తమ జట్టు తరఫున వన్డేల్లో ఫాస్టెస్ట్ హండ్రెడ్ బాదాడం ఇంకో విశేషం. ప్రస్తుతం యూఎస్‌ఏ ప్లేయర్ గజానంద్ సింగ్‌కు 35 ఏళ్లు కాగా.. సీన్ విలియమ్స్‌కు 36 ఏళ్లు, క్రెయిగ్ ఎర్విన్‌కు 37 ఏళ్లు. అలా లేటు వయసులో ఈ ముగ్గురు బ్యాటర్లు తమ బ్యాట్‌తో విరోచిత పోరాటం చేసి తమ జట్లను గెలిపించేందుకు బాగా ప్రయత్నించారు. దీంతో క్రికెట్ అభిమానులు వారిని ప్రశంసిస్తున్నారు.
world cup qualifiers 2023 : ఈ మ్యాచ్‌ల విషయానికొస్తే.. నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో సీన్ విలియమ్స్, క్రెయిగ్ ఎర్విన్ శతకాలు బాది జింబాబ్వేను విజయతీరాలకు చేర్చారు. ఈ మ్యాచ్‌లో కుళాల్ భుర్టెల్ 99 పరుగుల వద్ద ఔటై శతకాన్ని మిస్ అయ్యాడు. ఫైనల్‌గా నేపాల్‌పై జింబాబ్వే ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కానీ వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో గజానంద్ వీరోచిత శతకంతో.. తన జట్టు యూఎస్‌ఏను గెలిపించుకోలేకపోయాడు. విఫలయత్నం అయ్యాడు. యూఎస్‌ఏపై వెస్టిండీస్ 39 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 49.3 ఓవర్లలో 297 పరుగుల చేసి ఆలౌట్ అయింది. ఛార్లెస్ 66, హోల్డర్ 56, ఛేజ్ 55 పరుగుల చేసి ఆకట్టుకున్నారు. ఇక లక్ష్య చేధనకు దిగిన యూఎస్ఏ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 258 పరుగులు చేసి ఓటమిని అందుకుంది.
'ధనిక బోర్డు అంటే సరిపోదు.. కాస్త విజన్ కూడా ఉండాలి'.. BCCI సెలక్షన్‌పై మాజీ దిగ్గజం ఫైర్!
వరల్డ్ కప్ ముందు టీమ్ఇండియాకు గుడ్ న్యూస్.. ఆ సిరీస్‌తో బుమ్రా రీఎంట్రీ!