ETV Bharat / sports

IPL 2021: ఆ మ్యాచ్​లకు కమిన్స్​ దూరం!

ఆసీస్ స్టార్ బౌలర్​ ప్యాట్ కమిన్స్ ఐపీఎల్​ రెండో దశకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. దీంతో లీగ్​ పునఃప్రారంభానికి ముందు కోల్​కతా నైట్​ రైడర్స్​ జట్టుకు ఇదో ఎదురుదెబ్బ కానుంది. లీగ్​లో కమిన్స్ పాల్గొనకపోవడానికి ప్రత్యేక కారణమేమీ లేకపోవడం గమనార్హం.

pat cummins, australia cricketer
ప్యాట్ కమిన్స్, ఆస్ట్రేలియా క్రికెటర్
author img

By

Published : May 30, 2021, 4:16 PM IST

ఐపీఎల్ రెండో దశ ప్రారంభానికి ముందే కోల్​కతా నైట్​ రైడర్స్​కు ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. ఆస్ట్రేలియా పేసర్​ ప్యాట్​ కమిన్స్​ ఈ లీగ్​లో పాల్గొనకపోవడమే ఇందుకు కారణం.

"కుటుంబ కారణాల వల్ల ఆసీస్ క్రికెటర్లు డేవిడ్ వార్నర్​తో పాటు ప్యాట్​ కమిన్స్​.. వెస్టిండీస్ పర్యటనకు దూరమయ్యారు. మిగిలిన వారు యథావిధిగా మ్యాచ్​ల్లో పాల్గొంటారు. ఐపీఎల్​ మిగతా లీగ్​లో పాల్గొనని విషయాన్ని కమిన్స్​ ఇప్పటికే వెల్లడించాడు. అందుకు ప్రత్యేక కారణమేమీ లేదు. వేలంలో అత్యధిక ధర పొందిన ఆటగాళ్లలో ఇతడు ఒకడు" అని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్​ పత్రికా కథనం ప్రచురించింది.

అంతకుముందు ఇంగ్లాండ్ జట్టు మేనేజింగ్ డైరెక్టర్​ యాష్లే గైల్స్​ కూడా ఐపీఎల్​ కోసం తమ జట్టు ఆటగాళ్ల షెడ్యూళ్లలో మార్పులు చేయబోమని తెలిపారు. టీ20 ప్రపంచకప్​కు ముందు పలు సిరీస్​లు ఆడనుండటం ఇందుకు కారణమని చెప్పారు.

సెప్టెంబర్​ నుంచి అక్టోబర్​ మధ్య 25 రోజుల పాటు మిగిలిన ఐపీఎల్ మ్యాచ్​లను నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది.

ఇదీ చదవండి: IPL: ఐపీఎల్​ కోసం​ సీపీఎల్ షెడ్యూల్లో మార్పు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.