ETV Bharat / sports

ధోనీ అభిమానులకు గుడ్​న్యూస్.. మరో మూడేళ్లు సీఎస్కేతోనే!

వచ్చే ఏడాది ఐపీఎల్ (IPL 2022)​ నిర్వహణ కోసం బీసీసీఐ అన్ని ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు నవంబర్ 30 నాటికి ప్రస్తుత జట్లు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల వివరాలు సమర్పించాలని ఫ్రాంఛైజీలకు నిర్వాహకులు ఇప్పటికే స్పష్టం చేశారని తెలిసింది. దీంతో ధోనీని మరో మూడేళ్ల పాటు రిటైన్ చేసుకొనే ఆలోచనలో సీఎస్కే(CSK team 2022) ఉన్నట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి.

rohit, dhoni
రోహిత్, ధోనీ
author img

By

Published : Nov 25, 2021, 10:54 AM IST

Updated : Nov 25, 2021, 11:09 AM IST

వచ్చే ఏడాది ఐపీఎల్‌ ఈవెంట్‌(IPL 2022) పది జట్లతో మరింత ఘనంగా జరగనుంది. అందుకు సంబంధించి డిసెంబర్‌లో మెగా వేలం(IPL 2022 Mega Auction) కూడా నిర్వహించనున్నారు. అయితే, దానికంటే ముందు ఈనెల 30నాటికి ప్రస్తుత జట్లు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల వివరాలు సమర్పించాలని ఆయా ఫ్రాంఛైజీలకు నిర్వాహకులు ఇప్పటికే స్పష్టం చేశారని తెలిసింది. ఈ క్రమంలోనే చెన్నై తమ సారథి మహేంద్రసింగ్‌ ధోనీని మరో మూడేళ్లు అట్టిపెట్టుకుంటోందనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే రుతురాజ్‌ గైక్వాడ్‌, రవీంద్ర జడేజాతో పాటు ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్లు మొయిన్‌ అలీ లేదా సామ్‌ కరన్‌.. ఇద్దరిలో ఒకరిని తమవద్దే ఉంచుకోనున్నట్లు సమాచారం.

ఇక ముంబయి ఇండియన్స్‌(MI team IPL) జట్టు కెప్టెన్ రోహిత్‌, పేసర్‌ జస్ప్రిత్‌ బుమ్రాతో పాటు యువ బ్యాట్స్‌మెన్‌ ఇషాన్‌ కిషన్‌ లేదా సూర్యకుమార్‌లను అట్టిపెట్టుకోవాలని భావిస్తోంది. మరోవైపు రోహిత్‌ లేని సమయాల్లో జట్టును నడింపించే కీరన్‌ పొలార్డ్‌ను సైతం ముంబయి తమ వద్దే ఉంచుకోవాలని అనుకుంటున్నట్లు సమాచారం. మరోవైపు దిల్లీ క్యాపిటల్స్‌.. రిషభ్‌ పంత్‌, అక్షర్‌ పటేల్‌, పృథ్వీ షాతో పాటు దక్షిణాఫ్రికా పేసర్‌ ఆన్‌రిచ్‌ నోర్జ్‌లపై దృష్టిసారించింది. కాగా, ఈ ఏడాది కొత్తగా చేరిన జట్లలో సంజీవ్‌ గోయెంకా గ్రూప్‌ లఖ్‌నవూ ఫ్రాంఛైజీని చేజిక్కించుకోగా.. పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ను తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నారని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదీ చదవండి:

IPL 2022: ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్.. ఐపీఎల్-15 అప్పటినుంచే..!

Last Updated : Nov 25, 2021, 11:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.