ఆల్‌రౌండర్ల కొరత తీర్చేందుకు టీమ్ఇండియాలోకి కొత్తగా ప్రవేశించాడు వెంకటేశ్ అయ్యర్ (Venkatesh Iyer News). జట్టులో దీర్ఘకాలం కొనసాగేందుకు బ్యాటు, బంతి.. రెండింటిపై దృష్టి సారించాలని తనకు బాగా తెలుసని అంటున్నారు ఈ 26 ఏళ్ల మధ్యప్రదేశ్ కుర్రాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో (New Zealand Tour of India) జరిగే టీ20 సిరీస్ కోసం అతడికి జాతీయ జట్టు నుంచి పిలుపు వచ్చింది. ఈ నేపథ్యంలో అయ్యర్ చెప్పిన విశేషాలు..
"కొన్నాళ్లుగా పనిభారాన్ని బాగా నిర్వహిస్తున్నాను. నేను ఆల్‌రౌండర్. కాబట్టి బౌలింగ్, బ్యాటింగ్.. రెండింటిపై సమానంగా దృష్టి పెట్టాలి. రాష్ట్రస్థాయి నుంచి అదే చేస్తున్నా. టీమ్ఇండియాకు ఆడాలంటే.. అన్ని ఫార్మాట్లలోనూ నిలకడగా రాణించాలి. అందుకే ఎర్రబంతి (టెస్టు) ఫార్మాట్లోనూ బాగా కష్టపడుతూ ఉంటాను"
-వెంకటేశ్ అయ్యర్, టీమ్ఇండియా క్రికెటర్
ఐపీఎల్లో (Venkatesh Iyer IPL) కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున అత్యుత్తమ ప్రదర్శనతో దేశవ్యాప్తంగా అయ్యర్‌కు మంచి గుర్తింపు లభించింది. ఈ సీజన్లో 370 పరుగులు (Venkatesh Iyer IPL Runs) చేయడమే కాక మీడియం పేస్‌తో 3 వికెట్లు కూడా పడగొట్టాడు. రంజీల్లో మధ్యప్రదేశ్ తరపున 6 అర్ధ శతకాలు, 7 వికెట్లు తన ఖాతాలో ఉన్నాయి. ఐపీఎల్ సహా దేశవాళీల్లోనూ నిలకడగా రాణించడం వల్లే ఇంతదూరం రాగలిగినట్లు అయ్యర్ చెప్పాడు.
ప్రశ్న: యూఏఈలో ఐపీఎల్ ఆడుతున్నప్పుడే టీమ్ఇండియాలో అవకాశం వస్తుందని తెలిసిపోయిందా?
అయ్యర్: దేశానికి ప్రాతినిధ్యం (Venkatesh Iyer Team India) వహిస్తానని ఐపీఎల్లో మాత్రమే కాదు.. రంజీ, విజయ్ హజారే ట్రోఫీ, మధ్యప్రదేశ్ తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ ఆడేటప్పుడు కూడా నాకు తెలుసు. దేశావాళీల్లో మంచి ప్రదర్శన చేస్తూ ఉంటే ఒక రోజు భారత్‌కు ఆడతాననే నమ్మకం ఉండేది.
ప్రశ్న: ఇప్పుడు మీ ప్లాన్స్ ఏంటి?
ప్రస్తుతానికి ఎలాంటి ప్లాన్లు లేవు. నాకు వచ్చిన అవకాశాన్ని 100 శాతం కృషితో సద్వినియోగం చేసుకోవడమే. టీమ్ఇండియాకు విజయాలు అందించడానికి కృషి చేస్తా. ఎందుకంటే భారత్‌కు ఆడటం కన్నా గొప్ప గౌరవం ఏముంటుంది.
బాగా చదివితే లాభమే..!
ఇండోర్‌లో నివసించే (Venkatesh Iyer Native Place) సమయంలో కోచ్ దినేశ్ శర్మ.. అయ్యర్ ప్రతిభను గుర్తించి సానబెట్టారు. అనంతరం రాష్ట్ర స్థాయిలో ఎదుగుతూ.. అండర్-23 జట్టుకు సారథ్యం వహించాడు. ఫైనాన్స్‌లో ఎంబీఏ డిగ్రీ (Venkatesh Iyer Qualification) కూడా ఉన్న అయ్యర్‌కు డెలాయిట్ నుంచి ఉద్యోగ అవకాశం కూడా లభించిందట. అయితే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో క్రికెట్‌నే కెరీర్‌గా ఎంచుకున్నాడు.
"ఇంత త్వరగా జీవితం.. అందమైన మలుపు తీసుకుంటుందని ఊహించలేదు. చాలా చాలా సంతోషంగా ఉంది. నా కల ఇంత త్వరగా నెరవేరుతుందని అనుకోలేదు. చదువుల్లో రాణిస్తే.. అది మన ఆలోచన, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. మిగిలిన వారితో పోలిస్తే మనకు కొంతవరకు మేలు చేస్తుంది. మంచి విద్యార్థిగా ఉండటం నాకు సహజంగానే అలవడింది."
-వెంకటేశ్ అయ్యర్, టీమ్ఇండియా క్రికెటర్
ఐపీఎల్ (IPL 2021) తరహాలో కివీస్ సిరీస్‌లోనూ రాణిస్తే టీమ్ఇండియాలో అయ్యర్ (Venkatesh Iyer Latest News) దీర్ఘకాలంలో కొనసాగడం సహా కెప్టెన్ రోహిత్ శర్మకు కీలక అస్త్రం లభించే అవకాశం ఉంది.
ఇవీ చూడండి:
ఐపీఎల్లో అదరగొట్టి.. టీమ్ఇండియాకు ఎంపికై!
IND vs NZ series: 'టీమ్ఇండియా జెర్సీ ధరించాలనే కల నెరవేరింది'