ETV Bharat / sports

బాలీవుడ్‌లోకి స్టార్ క్రికెటర్​ ఎంట్రీ.. ఆ సినిమాతోనే - క్రికెటర్​ శిఖర్ ధావన్​

టీమ్​ఇండియా స్టార్‌ క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఆ వివరాలు..

Sikhar dhawan bollywood entry
బాలీవుడ్‌లోకి స్టార్ క్రికెటర్​ ఎంట్రీ.. ఆ సినిమాతోనే
author img

By

Published : Oct 11, 2022, 2:10 PM IST

టీమ్​ఇండియా స్టార్‌ క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. అతి త్వరలోనే అతడు వెండితెరపై మెరవనున్నాడు. ప్రముఖ కథానాయికలు సోనాక్షి సిన్హా, హ్యూమా ఖురేషీ ప్రధాన పాత్రల్లో నటించిన 'డబుల్‌ ఎక్స్‌ఎల్‌' సినిమాలో ధావన్‌ అతిథి పాత్రలో నటించాడు. ఇందుకు సంబంధించిన ఒక ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో ధావన్‌.. హ్యూమాతో కలిసి డ్యాన్స్‌ చేస్తు్న్నాడు. ఈ ఫొటోను హ్యూమా రీట్వీట్‌ చేసింది.

తన సినిమా అరంగేట్రం గురించి ధావన్‌ తాజాగా ఓ మీడియా సంస్థతో మాట్లాడాడు. ‘‘దేశం తరఫున ఆడే నా లాంటి అథ్లెట్‌ జీవితం క్షణం ఖాళీ లేకుండా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ నేను తీరిక చేసుకుని అప్పుడప్పుడు మంచి సినిమాలు చూస్తుంటాను. ఈ సినిమా అవకాశం నాకు వచ్చినప్పుడు ముందు కథ విన్నాను. అది నా మనసును తాకింది. ఈ చిత్రం సమాజానికి మంచి సందేశాన్నిస్తుంది. మనం ఎలా ఉన్నా.. మన కలలను నెరవేర్చుకోవచ్చన్న విశ్వాసాన్ని నింపుతుంది’’ అని ధావన్‌ వివరించాడు.

సతరమ్‌ రమానీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సోనాక్షి, హ్యూమా ఖురేషి లావుగా ఉండే అమ్మాయిల్లా కన్పించనున్నారు. సమాజంలో బొద్దుగా ఉండే మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంతో వినోదాత్మకంగా తీర్చిదిద్దిన ఈ సినిమా నవంబరు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌ ఆకట్టుకుంటోంది.

శిఖర్‌ ధావన్‌ సినిమాల్లోకి రానున్నట్లు గతంలోనూ వార్తలు వచ్చాయి. ఆ మధ్య అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘రామ్‌సేతు’ సినిమా సెట్‌లో ధావన్‌ కన్పించాడు. దీంతో ఈ సినిమాలో అతడు నటిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగింది. అయితే అందులో ధావన్‌ నటించట్లేదని ఆ తర్వాత నిర్మాణ సంస్థ వెల్లడించింది. గబ్బర్‌కు నటనపై ఆసక్తి ఎక్కువే. అనేక సందర్భాల్లో సోషల్‌ మీడియాలో పలు రీల్స్‌ చేస్తూ ఆకట్టుకున్నాడు. కాగా.. ఇప్పటికే క్రికెటర్లు ఇర్ఫాన్‌ పటాన్‌, శ్రీశాంత్‌ సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.

ఇదీ చూడండి: రజనీకాంత్​ శివాజీ.. ఈ అక్కాచెల్లిలను ఇలా చూశారా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.