ప్రపంచకప్-2019కు భారత జట్టును ఎంపిక చేసే తేదీ ఖరారు చేసింది బీసీసీఐ. ఏప్రిల్ 15న మెగాటోర్నీలో ఆడే 15 మంది క్రీడాకారుల జాబితాను ప్రకటించనుంది. మే 30నుంచి ఇంగ్లండ్ వేదికగా వరల్డ్‌కప్ జరగనుంది. మొత్తం పది దేశాలు ఈ టోర్నీలో పోటీపడనున్నాయి.
ఆస్ట్రేలియా(1987, 1999, 2003, 2007, 2015) అత్యధికంగా 5 సార్లు ప్రపంచకప్‌ను అందుకోగా.. వెస్టిండీస్(1975, 1979), భారత్(1983, 2011) చెరో రెండు సార్లు చేజిక్కించుకున్నాయి. పాకిస్థాన్(1992), శ్రీలంక (1996) చెరో సారి దక్కించుకున్నాయి.
ఇంగ్లండ్ 3 సార్లు ఫైనల్ వరకు వెళ్లినా.. ఒక్కసారీ కప్పు గెలవలేకపోయింది. స్వదేశంలో జరగనున్న ఈ ప్రపంచ్కప్నైనా గెలవాలని భావిస్తోంది ఇంగ్లీష్ జట్టు. మరోవైపు కోహ్లీసేన మూడోసారి ప్రపంచకప్‌ను ముద్దాడాలని చూస్తోంది. మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే ఈ టోర్నీ కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.