పాక్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిదీకి మద్దతుగా నిలిచాడు షోయబ్ అక్తర్. సీనియర్ ఆటగాళ్లు అఫ్రిదీని చాలా సార్లు అవమానించారని, వాటికి తానే సాక్ష్యమని చెప్పాడు అక్తర్. పాకిస్థాన్ మాజీ ఆటగాళ్లపై తన పుస్తకం గేమ్ ఛేంజర్ లో వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు అఫ్రిదీ.
షాహిద్ తన పుస్తకంలో చాలా తక్కువ విషయాలే రాశాడు. సీనియర్ ఆటగాళ్ల నుంచి అతడు చాలా సార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. నేను నా కళ్లతో చూశాను. ఈ విషయంలో అఫ్రిదీకి నేను మద్దతు తెలుపుతున్నా - షోయబ్ అక్తర్, పాకిస్థాన్ మాజీ పేసర్
కొన్ని ఏళ్ల తర్వాత 10 మంది సీనియర్ ఆటగాళ్లు అఫ్రిదీని క్షమాపణ కూడాఅడిగారని అక్తర్ చెప్పాడు. ఆస్టేలియా పర్యటనలో నలుగురు ఆటగాళ్లు తన మీద కూడా దాడి చేయడానికి ప్రయత్నించారని ఈ మాజీ పేసర్ ఓ టీవీ షోలో తెలిపాడు.
1999లో భారత్‌తో టెస్టు మ్యాచ్ సందర్భంగా నెట్స్‌లో ముందు ప్రాక్టీస్ చేయడానికి జావేద్ మియాందాద్ ఒప్పుకోలేదని అఫ్రిదీ తన పుస్తకంలో పేర్కొన్న విషయం తెలిసిందే.