మే 31న ప్రారంభంకాబోయే ప్రపంచకప్ కోసం క్రికెట్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తమ అభిమాన ఆటగాళ్లు సత్తాచాటాలని ప్రతి ప్రేక్షకుడు కోరుకుంటున్నాడు. ఈసారి మెగాటోర్నీలో మంచి ప్రదర్శన చేసేందుకు సిద్ధమవుతున్న ఆటగాళ్లలో కొందరు సీరియస్ ప్లేయర్స్ ఉన్నారు. ప్రతి జట్టులో విలువైన ఆటగాడి సత్తా ఏంటో చూద్దాం.
జాసన్ రాయ్ (ఇంగ్లాండ్)
ఆతిథ్య దేశంగా ప్రపంచకప్‌లో పాల్గొంటున్న ఇంగ్లాండ్‌కు ఈసారి ట్రోఫీ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందరో స్టార్ ప్లేయర్స్‌తో బరిలోకి దిగుతోందీ జట్టు. అందులో ఓపెనర్ జాసన్ రేయ్ కీలకం కానున్నాడు. జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించే ఈ ఆటగాడు తనదైన శైలిలో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడగలడు. ఇప్పటివరకు 75 వన్డేల్లో 40.81 సగటుతో 2,938 పరుగులు చేశాడు. పాకిస్థాన్‌తో జరుగుతున్న సిరీస్ నాలుగో వన్డేలో అద్భుత శతకంతో జట్టును గెలిపించాడు. కూతురు ఆరోగ్యం కోసం నిద్రలేని రాత్రి గడిపి మరుసటి రోజే సెంచరీ బాది ఆటపై తనకున్న ఇష్టాన్ని చాటుకున్నాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
విరాట్ కోహ్లీ (భారత్)
తక్కువ కాలంలోనే తనకంటూ గుర్తింపు తెచ్చుకుని టీమిండియాకు సారథిగా ఎదిగాడు కోహ్లీ. జట్టు ఏదైనా.. పిచ్ ఎలా ఉన్నా... పరుగులు సాధించగల సమర్థుడు. జట్టు గెలుపులో ఈ ఆటగాడు కీలకం కానున్నాడు. వన్డే, టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మొత్తం 227 వన్డేల్లో 59.57 సగటుతో 10,843 పరుగులు చేశాడు. ఇందులో 41 సెంచరీలు ఉండటం గమనార్హం. సారథిగా ఈసారి భారత్‌కు ప్రపంచకప్ ట్రోఫీ తెచ్చేందుకు శ్రమిస్తున్నాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్)
వేగం, కచ్చితత్వంతో బౌలింగ్ చేయగల నైపుణ్యమున్న బౌలర్ బౌల్ట్. ప్రస్తుతం అద్భుత ఫామ్‌లో ఉన్న ఈ ఫాస్ట్ బౌలర్ ప్రపంచకప్‌లో సత్తాచాటడానికి ఊవ్విళ్లూరుతున్నాడు. 2015 వరల్డ్‌కప్‌లోనూ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. కివీస్ జట్టులో విలువైన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 79 వన్డేల్లో 147 వికెట్లు తీశాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
క్రిస్ గేల్ (వెస్టిండీస్)
ఈ ప్రపంచకప్ తనకు చివరిదని ఇప్పటికే గేల్ ప్రకటించాడు. ఈ టోర్నీలో సత్తాచాటి జట్టుకు ట్రోఫీని అందించి కెరియర్ను ఘనంగా ముగించాలని ఆరాటపడుతున్నాడు. ఈ 39 ఏళ్ల విండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రీజులో ఉంటే ప్రత్యర్థి జట్టుకు కష్టమే. జట్టులో అత్యంత విలువైన ఆటగాడిగా ఉన్న గేల్ ఈ వరల్డ్‌కప్‌లో మెరుపులు మెరిపించాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటివరకు 288 వన్డేలాడిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ 38.02 సగటుతో 10,151 పరుగులు చేశాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
డెయిల్ స్టెయిన్ (దక్షిణాఫ్రికా)
140 కిలోమీటర్ల వేగంతో స్థిరంగా బౌలింగ్ చేయగల ఈ ఆటగాడు ప్రస్తుతం గాయాలతో సతమతమవుతున్నాడు. అయినా ప్రపంచకప్ నాటికి కోలుకుని సత్తాచాటగలడని అభిమానులు ఆశిస్తున్నారు. స్టెయిన్‌కు ఇది తుది ప్రపంచకప్ కావచ్చు. ఈ మెగాటోర్నీలో సత్తాటాటి ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిపోయిన ట్రోఫీ గెలవాలని ఆశిస్తుంది దక్షణాఫ్రికా జట్టు. 125 వన్డేలాడిన ఈ రైట్ హ్యాండ్ పేసర్ 125 వికెట్లు తీశాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా)
బాల్ టాంపరింగ్ వివాదంతో ఏడాది పాటు ఆటకు దూరమైన వార్నర్ నిషేధం అనంతరం ఐపీఎల్లో సత్తాచాటాడు. టోర్నీలో అత్యధిక పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. అద్భుత ఫామ్‌లో ఉన్న వార్నర్ ప్రపంచకప్‌లోనూ అదే జోరు కొనసాగించాలని చూస్తున్నాడు. 2015 వరల్డ్‌కప్‌లో 345 పరుగులు చేసి ఆకట్టుకున్నాడీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్. ఇప్పటివరకు మొత్తం 106 మ్యాచ్‌లాడి 43 సగటుతో 4,343 పరుగులు చేశాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ముస్తఫిజుర్ రెహ్మన్ (బంగ్లాదేశ్), మలింగ (శ్రీలంక)
ప్రపంచకప్ కోసం బంగ్లా జట్టు ముమ్మర సాధన చేస్తోంది. మెగాటోర్నీ కోసం ముస్తఫిజుర్‌ను టీ20 లీగ్‌లకు దూరంగా ఉంచింది బంగ్లా క్రికెట్ బోర్డ్. పేస్ పిచ్‌లపై స్వింగ్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టగలడు ఫిజ్. ఇప్పటివరకు 46 వన్డేలాడిన ఈ లెఫ్టార్మ్ స్వింగ్ బౌలర్ 83 వికెట్లు తీసుకున్నాడు.
శ్రీలంక పేసర్ మలింగ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్లో మంచి ప్రదర్శనతో ముంబయి ఇండియన్స్ టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ 35 ఏళ్ల యార్కర్ స్పెషలిస్ట్ 218 వన్డేల్లో 322 వికెట్లు తీశాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- " class="align-text-top noRightClick twitterSection" data="">
రషీద్ ఖాన్ (అప్గానిస్థాన్), బాబర్ ఆజమ్ (పాకిస్థాన్)
అఫ్గన్ యువ స్పిన్ సంచలనం రషీద్ ఖాన్‌పై జట్టు భారీ ఆశలే పెట్టుకుంది. బంతితోనే కాకుండా బ్యాట్‌తోనూ రాణిస్తూ తనెంత విలువైన ఆటగాడో నిరూపించుకున్నాడు. ప్రస్తుతం ఆల్‌రౌండర్ల విభాగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడీ మిస్టరీ స్పిన్నర్. బౌలింగ్‌లో 56 మ్యాచ్‌లాడి 123 వికెట్లతో కొనసాగుతున్నాడు. బ్యాటింగ్‌లో 56 మ్యాచ్‌ల్లో 782 పరుగులు చేశాడు. స్ట్రయిక్ రేట్ 100.77గా ఉంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
పాకిస్థాన్ యువ ఆటగాడు బాబర్ ఆజమ్‌పై ఎక్కువ నమ్మకమే పెట్టుకుంది ఆ జట్టు. 24 ఏళ్ల రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ తాజాగా జరుగుతున్న ఇంగ్లాండ్ సిరీస్‌లో ఓ సెంచరీ చేసి మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు 63 మ్యాచ్‌లాడి 51.13 సగటుతో 2,659 పరుగులు సాధించాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">