సౌతాంప్టన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్ రోహిత్ (122*) జట్టును ముందుండి నడిపించాడు. 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు సొంతం చేసుకున్నాడు. మరో 15 బంతులు మిగిలుండగానే భారత్ గెలిచింది.
వాహ్ వాహ్ రోహిత్...
మ్యాచ్ మొత్తానికి రోహిత్ ఇన్నింగ్సే హైలైట్. ఐపీఎల్, ప్రపంచకప్ వార్మప్ మ్యాచుల్లో విఫలమైన హిట్‌మ్యాన్... మెగాటోర్నీలో శతకం బాది జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
-
What a start to #CWC19 for India! A brilliant Rohit Sharma carries his bat to lead a six-wicket win!
— ICC (@ICC) June 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
South Africa slip to their third straight loss in the tournament. Is there a way back for them from here? #SAvIND SCORECARD 🔽 https://t.co/BRFVfISGgy pic.twitter.com/c4FNsSSF8S
">What a start to #CWC19 for India! A brilliant Rohit Sharma carries his bat to lead a six-wicket win!
— ICC (@ICC) June 5, 2019
South Africa slip to their third straight loss in the tournament. Is there a way back for them from here? #SAvIND SCORECARD 🔽 https://t.co/BRFVfISGgy pic.twitter.com/c4FNsSSF8SWhat a start to #CWC19 for India! A brilliant Rohit Sharma carries his bat to lead a six-wicket win!
— ICC (@ICC) June 5, 2019
South Africa slip to their third straight loss in the tournament. Is there a way back for them from here? #SAvIND SCORECARD 🔽 https://t.co/BRFVfISGgy pic.twitter.com/c4FNsSSF8S
ధావన్ 8 పరుగులకే వెనుదిరిగాడు. కోహ్లీ (18) తడబడుతూ ఇన్నింగ్స్ ఆరంభించి తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. అయినా రోహిత్ ఒత్తిడికి లోనవ్వలేదు. నిదానంగా ఆడుతూ స్కోరును ముందుకు నడిపించాడు. ఎంతో శ్రద్ధగా ఆడుతూ ఇన్నింగ్స్ చివరి వరకు ఉన్నాడు. రాహుల్‌తో విలువైన భాగస్వామ్యం నమోదు చేసిన హిట్‌మ్యాన్ ఈ దశలోనే అర్ధశతకం నమోదు చేశాడు. అ తర్వాత కూడా ఏకాగ్రత కోల్పోకుండా ఆడాడు. నలుదిశలా కళ్లుచెదిరే షాట్లతో విజృంభించాడు. రాహుల్ (26) ఔటైనా... ధోని (34)తో కలిసి జట్టు విజయాన్ని ఖరారు చేశాడు. ఈ దశలో ధోని ఔటయ్యాడు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య (15*)తో కలిసి పని ముగించాడు హిట్‌మ్యాన్. చివరి వరకు నిలిచిన రోహిత్ 122 పరుగులు చేశాడు.
ప్రోటీస్ బౌలర్లలో రబాడా రెండు వికెట్లు తీశాడు. మోరిస్, ఫెలుక్వాయో తలో ఒక వికెట్ పడగొట్టారు. ఈ ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఓడిపోయింది.
అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ప్రోటీస్ జట్టు నిర్ణిత 50 ఓవర్లకు 227 పరుగులు చేసింది. వరుస విరామాల్లో ప్రోటీస్ బ్యాట్స్‌మెన్‌ను పెవీలియన్‌కు పంపింది టీమ్ఇండియా. చివర్లో ఆల్‌రౌండర్ మోరిస్(42) దూకుడుగా ఆడటం వల్ల గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది.
-
122 runs and four #CWC19 wickets between this duo as India kick off their campaign with a win 🙌 pic.twitter.com/BFkrnr0ZH1
— Cricket World Cup (@cricketworldcup) June 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">122 runs and four #CWC19 wickets between this duo as India kick off their campaign with a win 🙌 pic.twitter.com/BFkrnr0ZH1
— Cricket World Cup (@cricketworldcup) June 5, 2019122 runs and four #CWC19 wickets between this duo as India kick off their campaign with a win 🙌 pic.twitter.com/BFkrnr0ZH1
— Cricket World Cup (@cricketworldcup) June 5, 2019
ప్రోటీస్ సారథి డూప్లెసిస్ (38), బౌలర్ రబాడా (31*) మిల్లర్ (31) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. భారత బౌలర్లలో చాహల్ నాలుగు వికెట్లతో రాణించగా.. బుమ్రా, భువనేశ్వర్ రెండేసి వికెట్లు తీశారు.
ఇదీ చూడండి: WC19: శతకంతో అదరగొట్టిన హిట్‌మ్యాన్