2011 ప్రపంచకప్... సొంత గడ్డపై వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు 58 పరుగులకే కుప్పకూలింది. ఇది ప్రపంచకప్‌లో అత్యంత తక్కువ స్కోర్లలో ఒకటి. ఈ మ్యాచ్ ఆ దేశ ప్రజల్లో ఆగ్రహావేశాలు తెప్పించింది. ఫలితంగా బంగ్లాదేశ్‌లోని ఢాకాలో వెస్టిండీస్ క్రికెటర్ల బస్సుపై రాళ్లతో దాడి చేశారు కొంత మంది అభిమానులు.
ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆటగాళ్లు జునైద్ సిద్దిఖీ, అష్రాఫుల్ మినహా ఒక్కరూ రెండంకెల స్కోరు చేయలేదు. నలుగురు ఆటగాళ్లు(తమీమ్ ఇక్బాల్, ముష్ఫికర్ రహీమ్, షఫుల్ ఇస్లామ్, రూబెల్) డకౌట్లుగా వెనుదిరిగారు. కెప్టెన్ షకీబుల్ అల్ హసన్ కూడా నిరాశపరిచాడు. తక్కువ లక్ష్యాన్ని చేధించి 9 వికెట్లతో విజయం సాధించింది విండీస్. 226 బంతులు మిగిలి ఉండగానే ఘన విజయం సొంతం చేసుకోవడం విశేషం.
విండీస్ జట్టులోని ముగ్గురు బౌలర్లు బంగ్లాను పదునైన బంతులతో వణికించారు. వారి ధాటికి బంగ్లా బ్యాట్స్మెన్లు పెవీలియన్‌కు క్యూ కట్టారు. ఎస్జే బెన్ నాలుగు వికెట్లు, కేఎజే రోచ్, డారెన్ సామి మూడేసి వికెట్లు తీశారు.
పొరపాటున...
విండీస్ ఆటగాళ్ల బస్సుపై రాళ్ల దాడి పెద్ద చర్చనీయాంశమైంది. ఘటనలో ఎవరూ గాయపడలేదు కానీ బస్సు అద్దాలు పగిలాయి. వెంటనే ఆటగాళ్లను హోటల్‌కు తరలించారు. అయితే విచారణ అనంతరం తేలిందేంటంటే బంగ్లా అభిమానులు దాడి చేద్దామనుకుంది చెత్త ప్రదర్శన చేసిన బంగ్లా క్రీడాకారులపై... కాని ఏ బస్సు ఎవరిదో తెలియక వెస్టిండీస్ జట్టు బస్సుపై దాడి చేసేశారు.
-
This is some bullshit.....Bangladesh stoning our bus!!! Freaking glass Break!!! This is crap,can't believe..what next bullets!!!! Kiss teeth
— Chris Gayle (@henrygayle) March 4, 2011 " class="align-text-top noRightClick twitterSection" data="
">This is some bullshit.....Bangladesh stoning our bus!!! Freaking glass Break!!! This is crap,can't believe..what next bullets!!!! Kiss teeth
— Chris Gayle (@henrygayle) March 4, 2011This is some bullshit.....Bangladesh stoning our bus!!! Freaking glass Break!!! This is crap,can't believe..what next bullets!!!! Kiss teeth
— Chris Gayle (@henrygayle) March 4, 2011