మరికాసేపట్లో ప్రపంచకప్ 2019 ఫైనల్ ప్రారంభం కాబోతుంది. ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఒక్కటే... టాస్ ఎవరు గెలుస్తారు? ఎందుకంటే ముందు బ్యాటింగ్ ఎంచుకున్న జట్టే విశ్వవిజేత అయ్యేందుకు అవకాశం ఎక్కువగా ఉంది. ఇందుకు నిదర్శనంగా గతంలో లార్డ్స్‌లో జరిగిన నాలుగు ఫైనల్స్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమే కప్పు ఎగరేసుకుపోయింది.
ఈ నాలుగు ఫైనల్స్‌లో టాస్ గెలిచిన ప్రతీ జట్టు ఓటమి పాలవడం మరో ఆసక్తికర అంశం. 1975, 1979, 1983, 1999 ప్రపంచకప్ ఫైనల్స్‌కు లార్డ్స్ వేదికగా నిలిచింది. 1999 మినహా మిగతా మూడు పైనల్స్‌లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది.
అయితే ఈ మెగాటోర్నీలో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించడం వల్ల మొదట బ్యాటింగ్ చేసిన జట్లే ఎక్కువ సార్లు గెలిచాయి. అందువల్ల టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశముంది. ముందు బ్యాటింగ్ చేసే జట్టే విజయం సాధిస్తుందని మాజీలు కూడా అభిప్రాయపడుతున్నారు.
"ఒకవేళ ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంటే భారీ స్కోరు చేసే అవకాశముంది. కివీస్ ఓపెనర్లు గప్తిల్, హెన్రీ నికోలస్ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతిష్టాత్మక పోరులో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆ ఒత్తిడిని జయిస్తే లార్డ్స్‌లో ఇంగ్లాండ్ జట్టు చరిత్రను తిరగరాసే అవకాశముంది. న్యూజిలాండ్‌కే నా మద్దతు ఇస్తాను. కానీ ఫైనల్ ఫేవరెట్ మాత్రం ఇంగ్లీష్ జట్టే" -షోయబ్ అక్తర్, పాక్ మాజీ ఆటగాడు.
-
#BackTheBlackCaps or #WeAreEngland – Who are you supporting in the #CWC19 final today?pic.twitter.com/wvU2Hfd4NP
— Cricket World Cup (@cricketworldcup) July 14, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">#BackTheBlackCaps or #WeAreEngland – Who are you supporting in the #CWC19 final today?pic.twitter.com/wvU2Hfd4NP
— Cricket World Cup (@cricketworldcup) July 14, 2019#BackTheBlackCaps or #WeAreEngland – Who are you supporting in the #CWC19 final today?pic.twitter.com/wvU2Hfd4NP
— Cricket World Cup (@cricketworldcup) July 14, 2019
ఇది చదవండి: ప్రపంచకప్ ఫైనల్ టికెట్ ధర 13 లక్షలా!