ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు మ్యాక్స్‌వెల్ మెరుపు ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. బెరెన్‌డార్ఫ్ వేసిన 42వ ఓవర్ రెండో బంతిని ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ క్రిస్ వోక్స్ క్యాచ్‌ను బౌండరీ లైన్ వద్ద అద్భుతంగా పట్టుకుని ఫించ్‌కు విసిరాడు. మరో వైపు బెన్ స్టోక్స్‌ను కళ్లు చెదిరే యార్కర్‌తో బౌల్డ్ చేశాడు స్టార్క్.
అద్భుతమైన ఫీల్డింగ్..
-
Good morning Australia!
— Cricket World Cup (@cricketworldcup) June 25, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
If you're just waking up and didn't manage to catch the action overnight, start your day by watching the defending world champions rip through England at Lord's to move into the #CWC19 semi-finals! #CmonAussie pic.twitter.com/G6kYqU3oqY
">Good morning Australia!
— Cricket World Cup (@cricketworldcup) June 25, 2019
If you're just waking up and didn't manage to catch the action overnight, start your day by watching the defending world champions rip through England at Lord's to move into the #CWC19 semi-finals! #CmonAussie pic.twitter.com/G6kYqU3oqYGood morning Australia!
— Cricket World Cup (@cricketworldcup) June 25, 2019
If you're just waking up and didn't manage to catch the action overnight, start your day by watching the defending world champions rip through England at Lord's to move into the #CWC19 semi-finals! #CmonAussie pic.twitter.com/G6kYqU3oqY
డీప్ మిడ్ వికెట్ వైపుగా వోక్స్ భారీ షాట్ ఆడాడు. అందరూ సిక్సర్ అని భావించారు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న మ్యాక్స్‌వెల్ అమాంతం గాల్లోకి ఎగిరి అందుకున్నాడు. అయితే అదుపుతప్పిన మ్యాక్సీ ఆ బంతిని ఫించ్ వైపు విసిరి బౌండరీ లైన్‌ను క్రాస్ చేశాడు. వెంటనే అప్రమత్తమైన ఫించ్ బంతిని ఒడిసిపట్టుకున్నాడు. నిరాశ చెందిన క్రిస్ వోక్స్ పెవిలియన్‌కు చేరాడు. చాకచక్యంతో మెరుపు ఫీల్డింగ్ చేసిన మ్యాక్స్‌వెల్‌ను అందరూ ప్రశంసిస్తున్నారు.
వాట్ ఏ యార్కర్..
-
Stunning Starc 🙌 #CmonAussie | #CWC19 pic.twitter.com/H18i31ELs2
— Cricket World Cup (@cricketworldcup) June 25, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Stunning Starc 🙌 #CmonAussie | #CWC19 pic.twitter.com/H18i31ELs2
— Cricket World Cup (@cricketworldcup) June 25, 2019Stunning Starc 🙌 #CmonAussie | #CWC19 pic.twitter.com/H18i31ELs2
— Cricket World Cup (@cricketworldcup) June 25, 2019
37వ ఓవర్ వేసిన స్కార్క్ చివరి బంతికి ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ స్టోక్స్‌ను బౌల్డ్ చేశాడు. కళ్లు చెదిరే ఇన్‌స్వింగింగ్ యార్కర్‌తో బంతిని సంధించి స్టోక్స్‌ను పెవిలియన్ పంపాడు. మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.
లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 64 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ప్రపంచకప్‌లో సెమీస్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది.
ఇది చదవండి: బాగానే ఉన్నా.. బాధపడకండి: బ్రియన్ లారా