ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్ జట్లు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయాయి. ఈ రెండు జట్ల మధ్య నేడు సాయంత్రం 6 గంటలకు కార్డిఫ్ వేదికగా మ్యాచ్ జరగనుంది.
దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్ జట్లు విజయం కోసం ఊవిళ్లూరుతున్నాయి. మెగాటోర్నీల్లో దురదృష్టవంతమైన జట్టుగా పేరు తెచ్చుకున్న దక్షిణాఫ్రికాకు ఈ ప్రపంచకప్ ఏ మాత్రం కలిసిరాలేదు. టోర్నీ మొదటి నుంచి ఓటములు జట్టును ఇబ్బంది పెడుతున్నాయి. వరుసగా ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, భారత్ చేతిలో ఓడిన సఫారీ జట్టుకు విండీస్‌తో మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. ఫలితంగా సెమీస్ ఆశల్ని దాదాపు కోల్పోయింది. బ్యాటింగ్‌లో నిలకడలేమి డుప్లెసిస్ సేనను ఇబ్బంది పెడుతోంది. సారథి డుప్లెసిస్, డికాక్, మిల్లర్, డుమిని మరింతగా రాణించాల్సిన అవసరం ఉంది. బౌలింగ్‌లో రబాడపై ఎక్కువగా ఆధారపడుతోంది.
-
Wherever you go, no matter the weather, always bring your own sunshine 🌞🔥 #ProteaFire #ItsMoreThanCricket pic.twitter.com/udweOyj3CM
— Cricket South Africa (@OfficialCSA) June 14, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Wherever you go, no matter the weather, always bring your own sunshine 🌞🔥 #ProteaFire #ItsMoreThanCricket pic.twitter.com/udweOyj3CM
— Cricket South Africa (@OfficialCSA) June 14, 2019Wherever you go, no matter the weather, always bring your own sunshine 🌞🔥 #ProteaFire #ItsMoreThanCricket pic.twitter.com/udweOyj3CM
— Cricket South Africa (@OfficialCSA) June 14, 2019
అఫ్గానిస్థాన్ కూడా వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక చేతిలో పరాజయం చెందింది. దక్షిణాఫ్రికాపై గెలవాలన్న పట్టుదలతో ఉంది. సారథి గుల్బదిన్, హజ్రతుల్లా, నబీ బ్యాటింగ్‌లో రాణించాలని జట్టు భావిస్తోంది. రషీద్ ఖాన్, మహ్మద్ నబీ స్పిన్‌తో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బందిపెట్టడానికి సిద్ధమయ్యారు.
దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్ మధ్య ఇదే తొలి వన్డే కావడం విశేషం. ఇంతకుముందు రెండు టీ20 మ్యాచ్‌ల్లో పోటీపడగా రెండు సార్లు సఫారీ జట్టు విజయం సాధించింది.
ఇవీ చూడండి.. ఆ ఇద్దరి వికెట్లపైనే పాక్ గురి : సచిన్