టీమిండియా కోచ్ రవిశాస్త్రి కాంట్రాక్టును మరో 45 రోజులు కొనసాగించాలని బీసీసీఐ క్రికెట్ పాలక కమిటీ(సీఓఏ) నిర్ణయించింది. ప్రపంచకప్ తర్వాత రవిశాస్త్రితో పాటు అతడి సహాయక సిబ్బంది కాంట్రాక్టులు ముగుస్తాయి. ఈ అంశంపై చర్చించి 45 రోజులు పొడిగించాలని నిర్ణయం తీసుకుంది సీఓఏ.
"రవిశాస్త్రితో సహా మిగిలిన సహాయక సిబ్బంది కాంట్రాక్టులు ఈ ప్రపంచకప్ తర్వాత ముగుస్తాయి. దీనిపై చర్చించి 45 రోజులు పొడిగించాలని నిర్ణయించాం" - సీఓఏ
రవిశాస్త్రితో పాటు సహాయక సిబ్బందిలో ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్, బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ కాంట్రాక్టు ముగిసేవారి జాబితాలో ఉన్నారు. ఆసక్తికర విషయమేంటంటే వీరి కాంట్రాక్టు కొనసాగింపుకు సంబంధించి ఎలాంటి క్లాజ్ పేర్కొనలేదు.
2017లో భారత కోచ్‌గా అనిల్‌కుంబ్లే వైదొలిగిన తర్వాత రవిశాస్త్రి ఆ పదవిని చేపట్టారు.